ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు..

ఏటా 4 లక్షలు . 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించారా?

సీఎం చంద్రబాబు నాయుడు , ఐటీ , మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నాళ్ళు ఇదే హామీని గుప్పిస్తూ ఉంటారు . ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయం . . అంటూ తండ్రీ , కొడుకులిద్దరూ పదే పదే ఇదే చెపుతుంటారు .

‘గెలిచిన తర్వాత మొదటి సంతకం హామీ . . మెగా DSC.. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా నెరవేరలేదు. ఇంకెలా నమ్మకం వస్తుంది వేళ్ళపై నిరుద్యోగులకు.

  • చంద్రబాబు తన పాత ధోరణి వదలడంలేదు .
  • తాను . . 1995 సీఎంగా తన ప్రతాపం చూపుతానంటున్నారు .
  • అప్పట్లో జనంలో కూడా కొన్ని పత్రికలూ , మీడియాపైనే ఆధారపడేవారు . చంద్రబాబు మాటలను ఈనాడు సపోర్ట్ చేస్తూ ఉండేది. అలా జనంలో వీళ్ళ హామీలు చులకనకాకుండా… పరిస్థితులకు అనుగుణంగా ఈనాడు , ఈటీవీ మద్దతుగా ఉండేవి . జనం మానసిక పరిస్థితిని టీడీపీ కంట్రోల్ లో ఉండేలా ఈనాడు వ్యవహరించి . . చంద్రబాబును పొలిటికల్ గా కాపాడగలిగేది .
  • ఇపుడు పరిస్థితి వేరు. చెప్పిన మాటలను జనం మర్చిపోయినా , , గుర్తు చేయడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది .
  • లక్షల ఉద్యోగాలు , లక్షల కోట్లతో అభివృద్ధి . . పరిశ్రమలు , సాఫ్ట్ వేర్ పార్కులు . . ఇలా చంద్రబాబు పదే పదే చెపుతున్న హామీలు మర్చిపోతే అతనిని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఆటాడుకుంటున్నాయ్ .
  • ఈ విషయాన్నీ చంద్రబాబు గమనించుకోవాలి . గతంలో తానూ చేసిన హైటెక్ సిటీ వంటి గొప్పలు ఇంకా పదే పదే ప్రస్తావించడం వల్ల కూడా ఒనగూరే ప్రయోజనం ఉండదు .
  • హైటెక్ సిటీ వంటివి తెచ్చి . . చంద్రబాబు ఐటీ కి ఆద్యుడయ్యాడని . . వేరే వారు చెపుతూ ఉండేలా చేసుకోవాలె కానీ , ప్రతిసారీ నేనే చేశాను . . అంటూ ఊకదంపుడుగా చెప్పడం చులకనగా ఉంటుంది .
  • ఇవన్నీ గమనించకుండా ఇదే ధోరణితో వెళితే చంద్రబాబు రాజకీయంగా వెనుకబడిపోవడం ఖాయం .