విశాఖ పశ్చిమ అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓటమిపాలైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆనంద్ కుటుంబం తెలుగుదేశంలో ఉండేది . 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు .
2024 ఎన్నికలలో ఓటమి పాలైన ఆనంద్ కుమార్, మరో పదిమంది డైరెక్తర్స్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.
టీడీపీ – జనసేన వారించినా . . చేర్చుకున్న బీజేపీ . .
అన్నింటా తమ పంతమే నెగ్గాలని , కూటమి పార్టీలో తనదే పై చేయి కావాలని భావించే చంద్రబాబు నాయుడికి ఈ పరిణామం మింగుడుపడటంలేదు . ఆనంద్ కుమార్ , మరో పదిమంది డైరెక్టర్స్ తొలుత టీడీపీ నేతలను అప్రోచ్ అయ్యారు . విశాఖ స్థానిక ఎమ్మెల్యేలు , ఇతర నేతలు , ప్రముఖంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వీరికి అడ్డుపడ్డారు . తర్వాత జనసేనలో చేరాలని ప్రయత్నం చేసారు . విశాఖ పట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ , మరికొంతమంది నేతలు . . అప్పటికే ఆనంద్ కుమార్ అక్రమాలపై పలు ఫిర్యాదులు చేసి ఉన్నారు . ఈ నేపథ్యంలో పార్టీలో చేర్చుకోవడానికి జనసేన అధిష్టానం కూడా వెనుకంజ వేసింది . ఆడారి ఆనంద్ కుమార్ . . కేంద్ర బీజేపీ పెద్దలను కలసి . . లాబీయింగ్ చేసుకుని తక్కువ వ్యవధిలోనే బీజేపీలో చేరిపోయారు .
విశాఖ డెయిరీ అక్రమాలపై హౌస్ కమిటీ : విశాఖ డెయిరీలో 250 కోట్ల రూపాయల కుంభకోణం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి . ఖరీదైన భూములు , డిపాజిట్లను కాజేశారని ఆనంద్ కుమార్ కుటుంబంపై నాలుగేళ్లుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి . ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం అసెంబ్లీ హౌస్ కమిటీని విశాఖ డెయిరీ పై విచారణకు నియమించారు . జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చైర్మన్ గా ఈ కమిటీ ఏర్పాటు చేసారు . ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు , దాట్ల బుచ్చిబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వి ఎస్ కె కె రంగారావు,, బొండా ఉమామహేశ్వరరావు హౌస్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు . ఈ కమిటీ డెయిరీలో ప్రాధమిక పరిశీలన చేసి అధికారులతో కలసి రికార్డులను పరిశీలించారు. అక్రమాలు బయటపడితే చర్యలు నుంచి తప్పించుకోవడం కష్టమని భావించిన విశాఖ డెయిరీ చైర్మన్ , డైరెక్టర్స్ జాప్యం చేయకుండా బీజేపీ పంచన చేరిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయ్.
అయితే ఆనంద్ కుమార్ , పదిమంది దైరేక్టార్స్ ను బీజేపీలో చేర్చుకోవద్దని టీడీపీ నుంచి ఒత్తిడి వచ్చినా , , పురందేశ్వరి , ఆ పార్టీ పెద్దలు లెక్కపెట్టలేదు . ఇపుడు టీడీపీ రాజకీయ వర్గాలలో ఇది హాట్ టాపిక్ గా మారింది .
- వైసీపీ అధికారంలో ఉన్నపుడు అక్రమాలకు పాల్పడిన , అరాచకాలకు పాల్పడిన వారిలో చాలా మంది టీడీపీ , జనసేన్లలో చేరిపోతున్నారు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీలలో వీలుకాని వారు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
- బాలినేని శ్రీనివాసరెడ్డి , సామినేని ఉదయభాను వంటి వైసీపీ నేతలు , , కూటమి సర్కార్ చర్యలు నుంచి తప్పించుకునేందుకు జనసేనలో చేరిపోయారు .