Kerala State Film Award 2024: ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్..!

Film Award 2024: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 54వ కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డులు (Kerala State Film Awards) ప్రకటించబడ్డాయి. ఇందులో ‘ఆడు జీవితం’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Hero Prithviraj Sukumaran) ఉత్తమ నటుడి (Best Actor) గా గెలుపొందారు.

ప్రముఖ నటుడు మమ్ముట్టితో పృథ్వీరాజ్ తలపడటంతో చివరి వరకు అవార్డు ఎవరికి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చివరకు ఆ అవార్డు పృథ్వీరాజ్ ను వరించింది. అయితే ఆడు జీవితంలో ఎడారిలో చిక్కుకున్న మలయాళీ వలసదారు (Malayali immigrant) నజీబ్ పాత్రను పృథ్వీరాజ్ పోషించగా.. ఆ పాత్ర ఆయనకు అత్యున్నత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఉత్తమ నటి అవార్డును ఊర్వశి అందుకున్నారు.

ఇక ఉత్తమ దర్శకుడి( Best director) గా ఆడుజీవితం డైరెక్టర్ బ్లెస్సీ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే బెంజమిన్ నవలను తెరపైకి తీసుకురావడంలో తీవ్ర కృషి చేసినందుకు గానూ బెస్ట్ స్క్రిప్ట్ అడాస్టేషన్ (Best script adaptation) అవార్డును కూడా గెలుచుకున్నారు. ఉత్తమ రెండవ చిత్రంగా ‘ఇరట్ట’ నిలిచింది. ఈ సినిమా రోహిత్ ఎంజీ కృష్ణన్ కు ఉత్తమ స్క్రీన్ రైటర్ (Best screenwriter)అవార్డును అందించింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సునీల్ కేఎస్ అవార్డు అందుకోగా సపోర్టింగ్ కేటగిరీలలో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ (Best Child Artist) గా తెన్నాల్ అభిలాష్ అవార్డును సొంతం చేసుకున్నారు. దాంతోపాటుగా గగనాచారి వినూత్న కథనానికి ప్రత్యేక జ్యూరీ ప్రశంసలు అందుకుంది.