రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి – సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
ఇటీవల కాలంలో ఇంత భారీ పెట్టుబడి దేశంలో ఎక్కడా పెట్టలేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ ఆంధ్రాలోనే పెద్దమొత్తంలో పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డారు ? ?? చంద్రబాబుపై నమ్మకమా ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ?
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఇటు వైపు ద్రుష్టి సారిస్తున్నాయి . సీఎం చంద్రబాబు పై పారిశ్రామికవేత్తల నమ్మకం ఒకవైపు వారిని ముందుకు నడిపిస్తోంది .
రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రిలయన్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది . ఈ క్రమంలో రిలయన్స్‌తో ఎంవోయూ చేసుకున్నారు . 500 సీబీజీ ప్లాంట్లు రానున్న 3 సంవత్సరాల్లో పూర్తిచేసేలా ఎంవోయూ చేసుకున్నామని ఈ సందర్బంగా చంద్రబాబు వివరించారు. దీని వల్ల రూ.130 కోట్ల మేర ఒక్కో ప్లాంట్‌కు రూ.65 వేల కోట్లతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. ‘ఏపీ ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అయితే ‘రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చేయాలని సూచించారు.రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ పాలసీ ద్వారా ఆకర్షించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పాలసీ ద్వరా 7.5 లక్షల ఉద్యోగాలు అనుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు రిలయన్స్ పవర్ ఇస్తోందని తెలిపారు. రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారంటూ మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవి, టీజీ భరత్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న ముకేష్ అంబానీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
8 జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు: బయోగ్యాస్ ప్లాంట్లను ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించదానికి ప్రభుత్వ్యం సన్నాహాలు చేస్తోంది . ప్రస్తుతం 8 జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయదానికి సన్నద్ధత వ్యక్తం చేసింది . మూడేళ్లలో బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తామని రిలయన్స్ అధికారులు తెలిపారు .
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇన్ని వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రంలోనే పెట్టాలని ఎందుకు ముందుకు వచ్చారు ? సీఎం చంద్రబాబు ఏ మ్యాజిక్ చేసి . ..65 వేల కోట్ల పెట్టుబడికి అంబానీని అంత ఈజీగా ఒప్పించగలిగారు ? ??