Hug Restrictions: మూడు నిమిషాలే కౌగిలించుకోండి,,,

ఎయిర్‌పోర్టుల్లో సెండాఫ్​ కౌగిలింతలపై న్యూజిలాండ్ ప్రత్యేక  ఆంక్షలు

… ఇదేంటీ కొగిలింతకు కూడా టైం నిర్దేశించడమా ?  అనుకుంటున్నారా ?   ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలలో భావోద్వేగ వీడ్కోలు సర్వ సాధారణం. ఆత్మీయులను సాగనంపడానికి కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టులకు వెళ్తుంటారు. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమాలే పలు ఎయిర్ పోర్టులలో ట్రాఫిక్ ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి .  ఈ సమస్యకు పరిస్కారం కోసం వినూత్న చర్యలు చేపట్టారు  న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు అధికారులు . ప్రయాణికుల బంధుమిత్రులు గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉండటం వల్ల

రద్దీ సమస్యను పరిష్కరించేందుకు విమానాశ్రయం డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో అధికారులు కాల పరిమితిని విధించారు. ”వీడ్కోలు చెప్పడం కష్టమే, కానీ గరిష్టంగా 3 నిమిషాల్లో ముగించండి ‘ ‘ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. విమానాశ్రయం వెలుపల రీడిజైన్ చేసిన ప్యాసింజర్ డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో సెప్టెంబర్‌ నుంచి దీనిని అమలు చేస్తున్నట్టు సిఈఓ  డాన్‌ డి బోనో తెలిపారు. వీడ్కోలు ఆలింగనాలతో పలు ఎయిర్‌పోర్టులలో వాహనాలకు జరిమానాలు పడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ఈ హెచ్చరిక బోర్డు వల్ల అలాంటి వాటి నుంచి బయటపడొచ్చని చెప్పారు. నిజానికి 20 సెకన్లు ఏ వ్యక్తినయినా హగ్‌ చేసుకుంటే సరిపోతుందని డాన్‌ డి బోనో తెలిపారు.