ABN RK.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన వైపు …

”కూటమి ఎమ్మెల్యేలు ,  మంత్రులు ,  అధికారులు అక్రమాలపై రాయవద్దని నేనేం చెప్పలేదు కదా . . రాయండి .  కాకపొతే ఎవిడెన్స్ పక్కాగా చూసుకోండి . ..” ఈ వ్యాఖ్యలు ఇటీవల జిల్లాల పర్యటనలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ రిపోరర్ట్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారట . .. 

జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి . . అదే పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ ( ABN RK ) స్టయిలే స్పెషల్ .  కాస్త మొండిఘటామనే చెప్పాలి .  2004-2009 మధ్య రాజశేఖర్ రెడ్డి ,  2019-2024 సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతిని ,  యజమాని రాధాకృష్ణను తీవ్ర వేదనకు గురిచేసారు .  అనేక తప్పుడు కేసులతో జర్నలిస్టుల ఆత్మ స్టయిర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించారు .  అయినా ఆర్కే వెనుకడుగువేయలేదు .  అదే అతనికి తెలుగు రాష్ట్రాలలో గొప్ప గౌరవాన్ని తెచ్చి పెట్టింది .    అయితే ఆంధ్రజ్యోతి క్రేజ్ ఉన్నా ఆ స్థాయిలో సర్క్యులేషన్ లేదు .  గతంతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఫోర్స్ కూడా తగ్గిందనే చెప్పాలి .  జిల్లాలలో అయితే మరీ చప్పగా సాగుతోంది జ్యోతి జర్నలిజం .     ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలలో పరిశోధనాత్మక కధనాలు కరువయ్యాయి .  దశాబ్దాలుగా పాతుకుపోయిన బ్యూరోలు ,  స్టాఫ్ రిపోర్ట్రర్స్ ఆంధ్రజ్యోతిని అడ్డంపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడంలోనే బిజీ అయ్యారు .  కొందరైతే సెటిల్మెంట్ కింగ్ల్ మాదిరి తయారయ్యారు .  అయితే వీరిని మార్చి సమర్థులను నియమించుకోవడానికి మార్కెట్ లో ప్రత్యామ్యాయం కనిపించడంలేదు .

సమర్థులైన జర్నలిస్టుల కొరత . .

కొన్ని చోట్ల ఇప్పటికే ఈనాడు , వార్త ,   సాక్షి పత్రికలలో తొలగించబడ్డ రిపోర్టులతోనే చాలా చోట్ల  నడిపిస్తున్నారు . ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందిన వారిని డెస్క్ లో సబ్ ఎడిటర్లుగా నియమిస్తున్నారు .  అంటే . .. ఫీల్డ్ జర్నలిస్టులను వీళ్ళు సొంతంగా తయారు చేసుకోలేకపోతున్నారు .          2019-2024 వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని నెగిటివ్ స్టోరీస్ వచ్చేవి .  మూడు నెలల క్రితం టీడీపీ ,  జనసేన ,  బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది .  దీంతో కూటమి సర్కారుపై ఇష్టానుసారం కధనాలు వ్రాయడానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇంకా తటపటాఇస్తోంది .  గతంలో 2014-2019 లో టీడీపీ అధికారంలో ఉన్నపుడు అప్పటి హోంమంత్రి చిన రాజప్ప పేకాట క్లబ్బులు , మైనింగ్ అక్రమాలు ,    ఇతర దందాలపై మెయిన్ ఫస్ట్ పేజీలో  యధేచ్చగా పబ్లిష్ చేసిన  ఆంధ్రజ్యోతి ఇపుడు ఆ పని చేయడానికి సంకోచిస్తుంది .   ఎండీ రాధాకృష్ణ ”టీడీపీ వాళ్ళైనా వదలొద్దు..”  అని మీటింగ్ లలో చెపుతున్నా . . బ్యూరోలు మాత్రం ఆ పని చేయడానికి వెనుకంజ వేస్తున్నారు .  ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయడమే దీనికి కారణం .  రాయని వాళ్ళని పక్కన పెట్టి కొత్తవారిని నియమించుకోవాలని చూసినా సమర్థులైన జర్నలిస్టులు దొరకడంలేదు .

  ” ఏంటి ఆర్కే గారూ … ఈ మధ్య ఆంధ్రజ్యోతి చప్పగా ఉంటోంది . . సరైన న్యూస్ రావడంలేదు . ” అని ఇటీవల ఎండీ రాధాకృష్ణ ఎయిర్ పోర్టులో కనిపించినప్పుడు ఒకతను అడిగారట .  ” ఏమి రాస్తే బాగుంటుంది . . చెప్పండి . ..” అని ఆర్కే సదరు వ్యక్తిని అడిగారట . ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి సిబ్బందే చెపుతున్నారు .  

ఆంధ్రజ్యోతికి న్యూస్ పరంగా మార్కెట్ లో మంచి పేరే ఉంది .  ధైర్యంగా రాయగలరని పొలిటికల్ సర్కిల్ లో నానుడి .  అయితే 2024 ఎన్నికల ముందు ఆరేడు నెలలపాటు ఈనాడు … అప్పటి జగన్ సర్కార్ అక్రమాలపై , అరాచకాలపై ధ్వజమెత్తింది .  ఆ రాతలకు ఆంధ్రజ్యోతి రాతలు తేలిపోయాయి .  ఆంధ్రజ్యోతి పరిశోధన కధనాలు ఆధారాలు లేకుండా ఇష్టానుసారం రాస్తారన్న అపవాదు ఎదుర్కొంది .  ఇపుడు దీని నుంచి బయట పడేందుకు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పర్యటన మొదలెట్టారు .  సర్కులేషన్ పెంచడం, యాడ్స్ రెవిన్యూ పెంచుకోవడంపై దృష్టి సారించారు .

ఎడిటర్ వక్కలంక ?  ఆంధ్రజ్యోతి తదుపరి ఎడిటర్ వక్కలంక రమణ . . అంటున్నారు హైదరాబాద్ సర్కిల్స్ లో .  ప్రస్తుత ఎడిటర్ కె .  శ్రీనివాస్ . .. ఇప్పటికే రిటైర్ అయి . . ఎక్స్టెన్షన్ లో కొనసాగుతున్నారు .  అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న వక్కలంక రమణ . . వచ్చే ఏడాది ఆంధ్రజ్యోతి ఎడిటర్ బాధ్యతలు తీసుకుంటారని చెప్పుకుంటున్నారు .  ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రజ్యోతి పరువు పెంచాలన్న ప్రయత్నంలో భాగంగా రాధాకృష్ణ ,  తన కుమారుడు ఆదిత్యను వెంటపెట్టుకుని యూనిట్లలో మీటింగ్ లు పెడుతున్నారు .  గతంలోనూ ఇలా చేసారు .  కానీ తర్వాత ఫాలో అప్ లేక ఆ మీటింగ్ ల సీరియస్ నెస్ లేకుండా పోయింది .  ఇపుడు అదే రీతిలో ఉంటుందో . . సంస్కరణలు చేస్తారో చూడాలి .