”స్వామీజీల ముసుగులో ఖరీదైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్న నకిలీ స్వాములను ఇలాగే వదిలేస్తుంటే సమాజంలో పేక్ స్వాముల సంఖ్య పెరిగిపోతుంది . .”
జగన్ గెలవడానికి , సీఎం అవ్వడానికి తపస్సు చేసానని అప్పట్లో గొప్పగా చెప్పుకున్న విశాఖ శారద పీఠం అధిపతి స్వరూపానంద ముందు నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగానే ఉన్నారు . ఆయనపై అనేక ఆరోపణలు , ఫిర్యాదులు ఉన్నా కూడా జగన్ సీఎంగా ఉన్నపుడు కోట్ల విలువైన భుమిని పప్పుబెల్లాలుగా పంచిపెట్టేసారు .
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అత్యంత ఆత్మీయ గురువు విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి శ స్వరూపానందేంద్రకి ఏపీ సర్కార్ ఝలక్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో శారదా పీఠానికి 15 ఎకరాల ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. ఈ భూమి విలువ రూ. 220-230 కోట్ల ఉంటుందని అప్పట్లో కొందరు అధికారులే అంచనా వేశారు . నాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ఆరోపణలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా భూమిని కట్టబెట్టారు .
ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , తెలంగాణకు కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా గెలుపొందడానికి సదరు స్వరూపానంద స్వామి యాగాలు నిర్వహించారు . 2019లో జగన్ గెలిచిన తర్వాత . .. తానూ జగన్ విజయం కోసం తపస్సు చేసినట్లు ప్రకటించుకుని జగన్ కి రాజగురువుగా మారారు . స్వరూపానంద గత చరిత్ర వివాదాలమయం . స్వామీజీకి ఉండాల్సిన కనీస లక్షణాలు కూడా లేకపోయినా . . తాను దైవాంశ సంభూతుడిగా తనకు తాను ఫీలయ్యే ఈ స్వామి తిరుమల కొండపై కూడా అక్రమ కట్టడాలు నిర్మించారు . తాజాగా విశాఖలో జగన్ కట్టబెట్టిన భూమిని చంద్రబాబు సర్కార్ రద్దుచేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం .