Secunderabad – Sri Muthyalamma Temple: అమ్మవారి విగ్రహం ధ్వంసం – ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత

సికింద్రాబాద్: మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆలయం వద్దకు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకర్ని అరెస్టు చేశారు.

హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డిఅన్నారు. కొందరు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని, మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.

సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీమంత్రి తలసాని, బిజెపి నేత మాధవీలత లను పోలీసులు అరెస్ట్ చేసారు.