srisilam temple: శ్రీశైలం దేవస్థానంలో ప్రసాదాల నాణ్యతపై తనిఖీ

తిరుపతి లడ్డూలో నాసిరకం నెయ్యి, ఇతర పదార్థాలు కలిశాయని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. దానికి తోడు జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ స్పందించడం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో అధికారుల దృష్టి ఆలయ ప్రదాలపై పడింది. ఈ క్రమంలో శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల నాణ్యతపై పరిశీలించారు.  అధికారులు షేక్ ఖాశీంవలి, ఓవీ రాముడు గురువారం లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న పదార్థాలు, ఆలయానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను  పరిశీలించారు. అలానే కౌంటర్‌ల వద్ద భక్తులకు అందిస్తున్న లడ్డూలను పరిశీలించారు.

పోయిన  వారంలో కూడా అధికారులు తనిఖీలు చేసి పడి తరానికి సరఫరా అయ్యే వస్తువులు, నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ లోని నాచారం ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న విషయం వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పుఢ్ సేఫ్టీ అధికారులు ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత,  ఉపయోగించే వస్తువులను తనిఖీలు చేస్తున్నారు.