‘ఇండియా వెడ్స్ లండన్’  ఇది కపుల్ లవ్​ స్టోరీ

‘ఇండియా వెడ్స్ లండన్’ ఇది కపుల్ లవ్​ స్టోరీ

సినిమాగా రూపుదిద్దుకోనున్న నిజజీవిత కధ

ఒకరిది ఇండియా , ఇంకొకరు బ్రిటన్ . వారిద్దరివి రెండు వేరు వేరు దేశాలు. విభిన్న పరిస్థితులు. అయినా సరే ఏకం అయ్యారు. వారి అభిరుచులే వారు ఇద్దరిని కలిపాయి . లండన్​కు చెందిన ఓ యువతి కర్ణాటకలోని గంగావతికి చెందిన యువకుడిని పెళ్లాడింది . వారి ప్రేమ కథేంటో మనమూ ఓ లుక్కేద్దాం . .

విరూపపుర గద్దే ప్రాంతానికి చెందిన మురళి స్థానికంగా ఓ గెస్ట్​ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే టూరిస్ట్​ గైడ్​గానూ పనిచేస్తున్నాడు. అయితే అతడికి సినిమాలు తీయాలనే కల కూడా ఉంది. ఇదిలా ఉండగా, వృత్తి రీత్యా ఫిల్మ్​ మేకర్ అయిన చార్లెట్ మేరీ ఫ్రాంక్లేయిర్ రెండేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చింది. మురళి నిర్మాతగా వ్యవహరించిన ‘ఐ లవ్ మై కంట్రీ ‘ అనే సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల అంగీకారంతో మురళి, చార్లెట్ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది . ఆడంబరాలకు పోకుండా గంగావతి రిజిస్టర్ ఆఫీస్​లో పెళ్లి సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే – వీరిద్దరూ కలిసి రూపొందించిన ‘ఇండియా వెడ్స్​ లండన్’ అనే షార్ట్​ ఫిల్మ్​ – మే 9న లండన్​లో జరిగే వీరి రిసెప్షన్ రోజునే విడుదల కానుంది. అంతేకాకుండా లోట్టీ ఫ్రాంక్లేర్ ఎంటర్​టైన్​మెంట్స్ అనే సంస్థను కూడా ప్రారంభిస్తున్నట్లు వీరు ప్రకటించారు .