by Srinivas Vedulla | Apr 16, 2025 | సినిమా
2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
ఆ స్టార్ సూర్య అని ఇటీవల ప్రచారం సాగుతోంది. నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.
by Srinivas Vedulla | Apr 8, 2025 | సినిమా
ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?
టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.
”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .