by Srinivas Vedulla | Apr 7, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్‌తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, టైటాన్, టీసీఎస్.
-
- కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి
by Srinivas Vedulla | Apr 6, 2025 | బిజినెస్
బిల్ గేట్స్ – పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 ఏళ్లయింది . ..
అల్లరి – చిల్లరగా తిరిగే వయసు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి కూడా పెద్దగా ఫోకస్ పెట్టే మెచ్యూరిటీ కూడా కాని ఆ వయసులో ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన చిన్న సంస్థ . .ఇపుడు ప్రపంచ స్థాయిలో దిగ్గజ కంపెనీగా ఎదిగింది.
1975 ఏప్రిల్ 4న ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన సంస్థ . . .. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని వాటిని గుణపాఠాలుగా మలచుకుని . . విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది . ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితులు నిర్మించిన ఈ మైక్రోసాఫ్ట్ అప్రతిహత విజయదరహాసాన్ని ఒకసారి నెమరువేసుకుందాం . …
మైక్రోసాఫ్ట్ ప్రారంభం: ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బిల్ గేట్స్, పాల్ అలెన్‌కు వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ జన్మించింది . ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలనేది అప్పట్లోనే ఈ ఇద్దరు స్నేహితుల కల . ఎందుకంటే ఆ సమయంలో కంప్యూటర్లు పెద్దవిగా ఉండటం, ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని వినియోగించడం క్లిష్టంగా ఉండేది.
వారి ఇరువురి పురోగతి MS-DOS (మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్) తో మొదలైంది. ఇది పర్సనల్ కంప్యూటింగ్‌కు పునాది వేసిన ప్రారంభ ఆపరేటింగ్ సిస్టమ్ (OS).
1975-1980: బిల్ గేట్స్, పాల్ అలెన్ అందరికీ పర్సనల్ కంప్యూటింగ్‌ను తీసుకురావాలనే విజన్‌తో పనిచేశారు. ఈ క్రమంలో వారు మొట్టమొదటి వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటైన ఆల్టెయిర్ 8800 కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి వారి మొదటి పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కార్పొరేషన్లలో ఒకటిగా ఎదిగింది.
1975: బిల్ గేట్స్, పాల్ అలెన్ ఇద్దరూ కలిసి 1975 ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. ఆల్టెయిర్ BASICను అభివృద్ధి చేసి ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌కు మారింది. ఈ క్రమంలో 1979-1978 చివరి నాటికి దీని సేల్స్ $1 మిలియన్లకు చేరుకున్నాయి.
1981-1990: ఇది మైక్రోసాఫ్ట్‌ను ఇంటింటికి పరిచయం చేసిన దశాబ్దం. ఆగస్టు 1981లో మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ (MS-DOS)ను విడుదల చేసింది. ఇది IBM పర్సనల్ కంప్యూటర్లలో పనిచేయడం ప్రారంభిస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగత కంప్యూటింగ్ వ్యవస్థలపై కంపెనీ ఆధిపత్యానికి ఇది కీలకమైన క్షణం.
1983: 1983లో మైక్రోసాఫ్ట్ తన కొత్త సాఫ్ట్‌వేర్ ‘విండోస్’ను సాగరవంగా ప్రకటించింది. ఇది విజువల్ ఫీచర్లతో MS-DOS ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
1985: 1985లో విండోస్ 1.0 విడుదలైంది. ఇది కంప్యూటింగ్‌ను రూపొందించే గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేసిన కీలక కంపెనీ .
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 1985: 1985లో మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0ని ప్రారంభించింది. ఈ విధానంలో కంప్యూటర్లను ఉపయోగించడాన్ని చాలా సులభతరం చేయడంలో ఒక టర్నింగ్ పాయింట్. మైక్రోసాఫ్ట్ సంవత్సరాలుగా విండోస్‌ను మెరుగుపరుస్తూనే ఉంది. వీరు రూపొందించిన ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌గా మారింది.
1986: మైక్రోసాఫ్ట్ తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌కు మార్చింది. ఇది ఒక్కో షేరుకు $21 చొప్పున పబ్లిక్‌గా విడుదలైంది. తర్వాత ఇది దాదాపు $60 మిలియన్లను సేకరించి విజ యం సాధించారు . . దీంతో బిల్ గేట్స్ 31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా మారడానికి ఇది కారణంగా నిలిచింది .
1987: మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల కోసం వరల్డ్ లోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థగా అవతరించింది.
1988: 1987లో విండోస్ 2.0 రాకతో, కార్యాలయంలో కంప్యూటర్లు అనేవి సాధారణం కావడం ప్రారంభమైంది. దీంతో ప్రపంచ అమ్మకాల ఆధారంగా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద PC సాఫ్ట్‌వేర్ కంపెనీగా అవతరించింది.
1989లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 1989లో ప్రారంభమైంది. ఇందులో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నాయి. వీటిని నేటికీ ఇళ్లు, స్కూల్స్, ఆఫీస్‌లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఇంటర్నెట్ అండ్ ఎక్స్పెన్షన్ 1990: 1990లలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ప్రవేశపెట్టింది. సర్వర్ సాఫ్ట్‌వేర్, బిజినెస్ టూల్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది.
1990-1995: విండోస్ 3.0 1990లో విడుదలైంది. దీనికి 5 సంవత్సరాల తర్వాత విండోస్ 95 రిలీజ్ అయింది. దీని సేల్స్ నాలుగు రోజుల్లోనే ఏకంగా 1 మిలియన్ కాపీలు దాటాయి. ఈ కంప్యూటర్లు ఇళ్లు, పాఠశాలలు, వ్యాపారాలలోకి ప్రవేశించడంతో PC అమ్మకాలు పెరిగాయి. దీంతో దీన్ని ‘విండోస్ యుగం’ (Windows Era) అని పిలిచేవారు.
1995లో విండోస్ 95: స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్, ప్లగ్-అండ్-ప్లే సపోర్ట్‌ను ప్రవేశపెట్టిన విప్లవాత్మక అభివృద్ధి. మొదటి ఐదు వారాల్లో 7 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విండోస్ 95 ప్లస్‌లో తొలిసారిగా ప్రారంభమైంది.
1995: ఇంటర్నెట్ రాకతో మైక్రోసాఫ్ట్ తన వెబ్ బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ను పరిచయం చేసింది.
1998: విండోస్ మొదటి వినియోగదారు వెర్షన్ అయిన విండోస్ 98 విడుదలైంది. అదే ఏడాది అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మైక్రోసాఫ్ట్ తన ప్రోగ్రామ్‌లను దాని ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కలిపినందుకు దానిపై’ యాంటీట్రస్ట్’ అభియోగాలను నమోదు చేసింది . సాఫ్ట్‌వేర్, గుత్తాధిపత్య పద్ధతుల్లో కంపెనీ తన ఆధిపత్యాన్ని ఉపయోగించి పోటీదారులను వ్యాపారం నుంచి తరిమికొట్టిందని US నియంత్రణ సంస్థలు చేసిన ఆరోపణలు అప్పట్లో దుమారం లేపాయి . వీటన్నింటినీ తట్టుకుని బిల్ గేట్స్ నిలబడ్డారు .
by Srinivas Vedulla | Apr 5, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెంపర్మెంట్ మనపైనా అత్యంత ప్రభావం చూపుతుంది.
అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తున్న దేశాలపై టారిఫ్ ల దెబ్బ ప్రపంచాన్ని కుదిపేస్తోంది . ఈ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తోంది. టారిఫ్ ల ప్రకటనకు ముందే మన మార్కెట్ పతనమైంది . అయినా మరోమారు . .. టారిఫ్ ప్రకటన రోజున కూడా భారీగా పడిపోయింది .
మరింత పతనం అయ్యే ప్రమాదం ? టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది . అమెరికాతో పోలిస్తే మన మార్కెట్ కొంత మెరుగని చెప్పాలి. అయితే టారిఫ్ ల భయం మాత్రం మదుపరులు , కంపెనీలపై ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. భారత్ మార్కెట్ లు హై నుంచి 13-15 శాతం పతనమయ్యాయి . ఈ ప్రభావం మరింత ఉంటుందని చెపుతున్నారు . 18- 20 శాతం వరకు పతనం ఉండొచ్చని అంచనావేస్తున్నారు.
30-40 శాతం పడిన స్మాల్ క్యాప్: స్మాల్ క్యాప్ షేర్స్ 30-40 శాతం పడ్డాయ్. మిడ్ క్యాప్ 20-25 శాతం పతనమయ్యాయి. అయితే అమెరికా టారిఫ్ లు మనదేశం కంటే చైనా వంటి పలు దేశాలపై మరింత ఎక్కువ విధించారు. ఈ ప్రభావం కూడా మన మార్కెట్ కి కొంతవరకు మెరుగని చెప్పాలి.
పతనమైన కోలుకునే ఛాన్స్ : సోమ, మంగళ వారాలలో మన షేర్ మార్కెట్ భారీగా పడినా , , క్రమంగా కోలుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. టారిఫ్ ల ప్రభావం వల్ల తాత్కాలికంగా బలహీనపడిన , , నాలుగైదు నెలల వ్యవధిలో పెరుగుతుందని చెపుతున్నారు .