
ఎన్టీఆర్ పై లేని ‘కమ్మ ముద్ర’ చంద్రబాబుపైనే ఎందుకు?
‘కమ్మ ‘ కులానికి చంద్రబాబు ”మేళ్లు ‘ ‘ చేయకపోయినా విమర్శలు ఎందుకు ? రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించేది సొంత కులంలోనే ఎక్కువ – అరాచకాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబును తూర్పారబెడుతున్న తెలుగు తమ్ముళ్లు – టీడీపీ మద్దతు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా
చంద్రబాబూ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది
గొప్ప పరిపాలనా దక్షుడు – రాజకీయ చాణక్యుడు – గ్రేట్ విజనరీ – అభివృద్ధి విధాత . .. ఇలాంటి ఎన్నో గొప్ప పదాలు , పోలికలు చంద్రబాబుకి మణిహారాలు. ఈ తరం నేతలలో చంద్రబాబు నిస్సందేహంగా పరిపాలనా దక్షుడే. అకుంఠిత దీక్ష , కష్టపడే తత్త్వం , అధికారులు , ఉద్యోగులను పరుగులు పెట్టించే నైజం ఈయనిది. ప్రత్యేకంగా కులాలపై ప్రేమ ఉండదు. అయినా చంద్రబాబుకి ”కమ్మ ‘ ‘ ముద్ర ఎందుకు పడుతుంది. లేని అపఖ్యాతిని ఎందుకు మూటకట్టుకోవాల్సి వస్తోంది? సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు .. పై ఎప్పుడూ కమ్మ ముద్ర పడలేదు . బడుగు , బలహీనవర్గాల అజెండాతో పార్టీని స్థాపించారు . అంత సిన్సియర్ గా పాలన సాగించారు . పాలన వ్యవహారాలలో ఎన్టీఆర్ కంటే మెరుగ్గా చేసినా , రాజకేయం ఈ విషయంలో చంద్రబాబులో అంత సిన్సియారిటీ కనిపించదు
స్వయంకృతమే:
2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రులుగా సుజనా చౌదరి , అశోక్ గజపతి ఉన్నారు . వీరిలో అశోక్ గజపతిరావు మంచి పేరున్న నేత. విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడిగా అశోక్ గజపతి ఖ్యాతిపొందారు . అలాంటి నేతను పక్కన పెట్టి . .. లాబీయిస్టుగా పేరొందిన సుజనా చౌదరిని రాజకీయంగా ముందు పెట్టారు. కేంద్రంలో ప్రాధాన్యత తీసుకువచ్చారు.
- చంద్రబాబు చేసిన ఈ పనికి అప్పట్లో రాష్ట్రంలోనూ , కేంద్రంలోనూ ‘కమ్మ ముద్ర ‘ తెచ్చుకున్నారు .
- 2014-2019 సమయంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉత్తరప్రదేశ్ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి ఏఎస్ రాజమౌళిని డిప్త్యూటేషన్ పై తీసుకువచ్చారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అనే కమ్మ కులానికి చెందిన అడ్వొకేట్ ని అడ్వొకేట్ జనరల్ చేశారు . మళ్ళీ పదేళ్ల తర్వాత 2024 జూన్ లో అధికారంలోకి వచ్చినపుడు ఇదే చేసారు . (రాజమౌళి , దమ్మాలపాటి లకు మళ్ళీ అవే పదవులు ఇచ్చారు )
- ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి (టీడీపీ కోటాలో ) రామ్మోహన్ నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు . రామ్మోహన్ నాయుడు తన పని తాను చేసుకుంటుండగా , పెమ్మసాని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు పార్టీ కేడర్ నుంచే ఫిర్యాదులు వస్తున్నాయ్ . చంద్రబాబుకి కమ్మ ఫీలింగ్ పెద్దగా లేకపోయినా . . ఇలాంటి నాయకులు చేస్తున్న హంగామాకి కమ్మ కులంపై ముద్రపడింది .
- నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి కట్టబెట్టారు . ఇతను వైసీపీ నుంచి వచ్చిన నేత . అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు . అలాంటి నేతకు కీలక పదవి ఇవ్వడంపై చంద్రబాబుపై పార్టీలో కమ్మ ముద్ర ఖచ్చితంగా పడుతుంది .
- అనంతపురం అసెంబ్లీకి దగ్గుబాటి ప్రసాద్ అనే రియల్టర్ ని తెచ్చి పెట్టారు . అతను చేసే అరాచకాలకు పార్టీకి చెడ్డపేరు వస్తుంది . ఈ పేరు కమ్మ కులానికి ఆపాదించేందుకు వైసీపీ ఎలాగూ ప్రయత్నం చేయడం సహజం. అంతకుముందున్న ప్రభాకర్ చౌదరికి కమ్మ మార్క్ కంటే అందరివాడు అనే పేరుంది . అలాంటి వారిని పక్కనపెట్టి బెంగుళూరు రియల్టర్ ని తెచ్చి పార్టీకి చెడ్డ పేరు, కులం ముద్ర రావడానికి పరోక్ష0గా చంద్రబాబు కారణమవుతున్నారని అక్కడ ప్రచారం సాగుతోంది .
బాబు పీఎస్ , పీఏ , సెక్రెటరీ . . అంతా కమ్మవారే . ..
సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరి కృష్ణ కపర్తి, పీఏ రాజగోపాల్ , కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి కమ్మవారు. టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో కార్యకలాపాలు పర్యవేక్షించే టీడీ జనార్దన్, లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారి రాజేష్ కమ్మవారు కావడం గమనార్హం . అయితే .. ఇందులో కొందరు ఆర్బాటం చేయడం , చంద్రబాబుకి తాము అత్యంత దగ్గరి మనుషులం అని బిల్డప్ ఇవ్వడం వంటి కారణాలు … చంద్రబాబుకి ”కమ్మ ముద్ర ‘ను అంటిస్తున్నాయ్ .
రాజశేఖర్ రెడ్డి , జగన్ ల కంటేనా ? ”తమ పాలనా కాలంలో సొంత కులానికి భారీగా మేళ్లు చేయలేదు . దోపిడీకి సహకరించలేదు . రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రులుగా ఉన్నపుడు సొంత కులం వారికి భారీగా దోచిపెట్టారు . అయినా వారి కంటే చంద్రబాబుకే ఎక్కువ కుల ముద్ర వస్తుందంటే అది కమ్మవారికున్న శాపమే తప్ప మరేమీ కాదు . .” అని ఓ టీడీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు .
యనమల లాంటి వాళ్ళు ‘కమ్మ ‘ వాళ్లను దోపిడీదారులుగా చిత్రీకరించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోరు. కనీసం వివరణ కూడా అడగడానికి సాహసించరు . దివీస్ కంపెనీ మురళిపై యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు కులం పేరుతొ చేసారు. దీనిపై పార్టీ కూడా యనమల వివరణ తీసుకోలేదంటే . .. కమ్మ కులం దోపిడీపై యనమల చేసిన ఆరోపణలు నిజమన్న అభిప్రాయం సమాజంలో చాలామందికి వస్తుంది. ఇలాంటి వాటిని కట్టడి చేయడంలో చంద్రబాబు అసమర్దుడన్న పేరు ఉంది.
ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీ హయాంలో విద్యుత్ కాంట్రాక్టులలో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షిర్డీ సాయి , పోలవరంలో దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి , రాయలసీమలో కారుచౌకగా భూములు కొట్టేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో … ఈ కంపెనీలు ఏవీ కమ్మ వారివి కావు . అయినా వీరిని ప్రోత్సహిస్తున్నారు . దీనిపై జనంలో పెద్దగా చర్చ ఉండదు . చర్చకు వస్తే . .. మాత్రం వారి నుంచి మామూలు అందుకుంటున్నారన్న ఆరోపణలు తెరమీదకు తెస్తారు.
పరిపాలనలో సమర్థులైన వారిని ఈనాడులో మేనేజర్లుగా పెట్టుకునేవారు రామోజీరావు . వాళ్లలో మెజార్టీ కమ్మ వారు ఉండేవారు. అంతమాత్రాన ఈనాడులో కమ్మ వారిదే హవా . . అంటే కరెక్ట్ కాదు కదా .. అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నా . .. సోషల్ మీడియాను కట్టడి చేయలేక . .. వైసీపీ అరాచకవాదులు , అబద్దాలతో బూకరించేవారికి సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వలేక కమ్మ ముద్ర వేసుకుంటున్నారు .