డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అంటే విపరీతమైన ఇష్టమా? అయితే మీ హెల్త్ డేంజర్ లో ఉన్నట్లే
బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు సాధారణం కంటే రెట్టింపు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పదార్థాలను ఎక్కువగా ఫ్రై చేసి తీసుకోకూడదని వివరిస్తున్నారు శాస్త్రవేత్త లు .
చికెన్ : చికెన్ , మీట్ ( మాంసాన్ని )ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు సెలవిస్తున్నారు . ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఏర్పడతాయని అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి . ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్‌కు కారకమయ్యే కార్సినోజెన్స్ అనే రసాయానాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని కుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు .
ఆలూ చిప్స్ : బంగాళదుంపలు : ఇటీవల కాలంలో యూత్ చిప్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు . వీరిని చూసి చిన్నారులు కూడా చిప్స్ పై మోజు పెంచుకుంటున్నారు . సైడ్ డిష్‌గా, స్నాక్స్‌గా వీటిని తింటుంటారు. అయితే, బంగాళ దుంపలను చాలా సేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా క్యాన్సర్‌కు దారితీస్తుందని తెలుపుతున్నారు. అందుకే చిప్స్ కాకుండా వీటిని ఉడకబెట్టడం లేదా బేక్ చేసుకుని తినాలని సూచిస్తున్నారు.
బ్రెడ్ : చాలా మంది బ్రెడ్‌తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు ఇష్టపడుతుంటారు . బ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు . అందుకే మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాల్చుకోవాలని లేదా బేక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
సూచన : అభి న్యూస్ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసమే . శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని ఇచ్చాము . అభి న్యూస్ హెల్త్ శీర్షికను ఫాలో అయ్యే వారు తమ సొంత వైద్యులు , డైటీషియన్స్ సలహా ప్రకారం ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవాలని మనవి .