Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. ఈ మేరకు సర్కార్ అమలు చేస్తున్న ‘‘ గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme)’’ కోసం మరోసారి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఇందుకోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అర్హులందరికీ లబ్ధి చేకూరలనే ఉద్దేశంతో మళ్లీ దరఖాస్తులను తీసుకోవాలని సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల (Applications) స్వీకరణ కోసం చర్యలు చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తు చేసుకోని వారి నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగానే అర్హత కలిగిన కుటుంబాల గృహ వినియోగాల కోసం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Current) ను సైతం అందిస్తోందన్న సంగతి తెలిసిందే.