చంద్రబాబు విధాన నిర్ణయాలను ప్రజలు విశ్వసిస్తున్నారా ?
ఆంధ్రుల రాజధాని అమరావతి నిజంగానే దూసుకుపోతుందా? కూటమి నేతలు చెపుతున్నట్టు ‘ప్రపంచంలోనే టాప్ – 5 సిటీస్ ‘ లో చోటు దక్కించుకుంటుందా ? వీరు చేస్తున్న ప్రకటనలకు , ఫీల్డ్ లో జరుగుతున్న పనులకు పొంతన కనిపిస్తుందా ? కనీసం పదేళ్ళకయినా ప్రపంచ నగరాలతో పోటీపడే ప్లాన్ తో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ?
రాజధానిలో శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది . అయితే చంద్రబాబు నాయుడు చెపుతున్నంత వేగవంగంగా మాత్రం ‘అమరావతి రయ్ రయ్ ‘ మంటూ దూసుకుపోయే పరిస్ట్టి ఉండకపోవచ్చు . ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో స్టబ్టత నెలకొంది. రానున్న మూడు , నాలుగేళ్లపాటు రియల్ మూమెంట్ అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయ్ . ఈ నేపథ్యంలో అమరావతి కూడా అంతంతమాంత్రంగానే రియల్ ఎస్టేట్ నడుస్తుంది . అయితే కూటమి సర్కార్ చేస్తున్న హంగామాకు జనంలోనూ , రాజధాని వాసులలోను హైప్ వస్తోంది . దీంతో వాస్తవ పరిస్థితులను వీరు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
భూముల ధరలు భారీగా . .. ప్రస్తుతం అమరావతి , పరిసర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి . హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పడిన సమయమ్లోను , శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణము సమయంలోను ప్రారంభంలో అక్కడి భూముల ధరలు కాస్త అందుబాటులో ఉండేవి . దీంతో జనం ఎగబడి భూములు కొనుగోలుకు ముందుకు వచ్చారు . ఇపుడు అమరావతి బూస్ట్ అప్ అవుతుందని ముందే ఊహించి భారీగా పెంచేశారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తతం చదరపు గజం భూమి ధర రూ 35 వేల నుంచి రూ 70 వేల వరకు ఉంది . అయితే లావాదేవీలు ఎక్కువగా జరగడంలేదు . అమ్ముడుపోకపోయినా రైతులు , రియల్టార్లు మాత్రం ధరలు తగ్గించి అమ్మడానికి ఇష్టపడటంలేదు .
ఈ నేపథ్యంలో నాలుగైదేళ్ల వరకు అమరావతి ప్రాంతంలో భూముల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అయితే ప్లాట్లు యజమానులు మాత్రం …. ఇపుడు ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం అయితే . .. ఐదారు నెలలలోనే గజం లక్షకు పెరుగుతుందని ఆశతో ఉన్నారు.
హైదరాబాద్ ఎఫెక్ట్ : 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రా నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తరలిపోయాయి . ఆ సమయంలో హైదరాబాద్ మంచి హైప్ లో ఉంది. అక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి భూములు , విల్లాలు కొనుగోలు చేశారు . ఇటీవల రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచున సాగుతోంది . ఈ నేపథ్యంలో అక్కడ విక్రయించి . . అమరావతిలో పెట్టుబడులు పెడదామని భావిస్తున్న ఆంధ్రులకు అవకాశం దొరకడంలేదు . దీంతో అమరావతికి వచ్చే పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు భావిస్తున్నాయి.
పదేళ్ల సమయం పడుతుంది : అమరావతి విశ్వనగరంగా అవతరించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది . ఇపుడు జరుగుతున్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా . .. 2029 లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు కొనసాగుతాయి . పొరపాటునో , గ్రహపాటునో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అమరావతిని మళ్ళీ భ్రష్టు పట్టించారని చెప్పలేం . .. ఇదే కారణంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ పెట్టుబడిదారులు తటపటాయిస్తున్నారు . దీనిపై కూటమి సర్కార్ , ,, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని జనంలో బలమైన నమ్మకం కలిగేలా చేయగలగాలి . లేకపోతె చంద్రబాబు చెపుతున్న కబుర్లకు , జరుగుతున్న పనులకు కొంత గ్యాప్ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కలగదు. దీనిని కూటమి నేతలు గుర్తెరగాలి .