లోకేష్ కి టీడీపీ పగ్గాలు : పిఠాపురం వర్మ

Srinivas Vedulla

”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు.  కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు. 

పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .

కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .

You May Also Like…