తమిళనాడులో ఏపీ తరహా పాలిటిక్స్

తమిళనాడులో ఏపీ తరహా పాలిటిక్స్

అన్నాడీయంకె తో చేతులు కలిపిన బీజేపీ – 2026 ఎన్నికల కోసం ఏడాది ముందే రంగంలోకి . ,

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరియు మిత్ర పక్ష పార్టీలతో కలిసి పోటీ చేయడానికి ఎఐఎడిఎంకె తిరిగి ఎన్డీఏలోకి చేరింది. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే సీట్ల భాగస్వామ్యం మరియు ప్రభుత్వ కూర్పు వంటి విధానాలను తరువాత చర్చిస్తారు.

తమిళనాడు లో బీజేపీకి 3 శాతం కూడా ఓట్లు లేవు. అయినా 2026 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో కాలుమోపెందుకు , 2029 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదిలో బలోపేతం అయ్యే సంకల్ప0తో కమలనాధులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు . 2024 లో ఆంధ్రప్రదేశ్ లో సైతం . .. 2 శాతం ఓట్లులేని బీజేపీ 8 అసెంబ్లీ , నాలుగు లోక్ సభ సీట్లను గెలుపొందడం ద్వారా తమ సత్తా చాటుకుంది .

తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె ఇతర మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తాయి.

చెన్నైలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా బిజెపి-ఎఐఎడిఎంకె కూటమి పునరుద్ధరణను ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హాజరైనప్పటికీ, విలేకరుల సమావేశంలో మాత్రం అంతా ఆయన మౌనంగానే ఉన్నారు.

అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాతే ఈ కూటమి ఏర్పడిందా అని అడిగినప్పుడు, షా మాట్లాడుతూ, “అందులో కొంచెం కూడా నిజం లేదు ఎందుకంటే అన్నామలై ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మరియు అందుకే ఆయన నా పక్కనే కూర్చున్నారు” అని అన్నారు.

పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య మరియు ప్రభుత్వ కూర్పు – కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత – తరువాత చర్చిస్తామని షా అన్నారు. “వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.

డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను సనాతన ధర్మం, త్రిభాషా విధానం మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను మళ్లిస్తున్నారని బీజేపీ నాయకుడు అన్నారు.

నీట్ అంశంపై, డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికి తన సమస్యలను ఉపయోగిస్తోందని షా అన్నారు.

బిజెపి ఎల్లప్పుడూ తమిళ ప్రజలను, తమిళ రాష్ట్రాన్ని మరియు తమిళనాడును గౌరవిస్తుందని హోంమంత్రి అన్నారు.

“ఆ గౌరవం మరియు తమిళ వారసత్వాన్ని గౌరవిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్టించారు. కానీ డిఎంకె దానిని తప్పుగా సూచిస్తోంది” అని ఆయన మండిపడ్డారు .

“మేము తిరుక్కురల్‌ను వివిధ ప్రపంచ భాషలలోకి అనువదిస్తున్నాము, ఇది ఇప్పటికే 63 భాషలలోకి అనువదించబడింది. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమిళనాడులో శాస్త్రీయ తమిళంలో పరిశోధనలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ తమిళ సాహిత్య పండితుల రచనలను కూడా ప్రచురించారు. నేడు, తమిళనాడులోని యువత తమిళంలో ఐఎఎస్ మరియు ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలు రాయగలరు. కానీ కేంద్రంలో డిఎంకె కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాలేదు” అని కూడా ఆయన అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఆయా రాష్ట్ర భాషలలో వైద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుందని షా అన్నారు. “గత మూడు సంవత్సరాలుగా, నేను తమిళనాడును సందర్శించిన ప్రతిసారీ, నేను దీని గురించి ఎంకె స్టాలిన్‌ను కోరుతున్నాను. అయితే, ఈ కోర్సులు ఇప్పటికీ తమిళంలో అందించడం లేదు” అని ఆయన అమిత్ షా చేసిన ఆరోపణలను ఈ సందర్బంగా గుర్తుచేసుకోవాలి .

డీఎంకేపై షా నిప్పులు చెరిగారు
డీఎంకే తన ఎక్సైజ్ విధానం ద్వారా ₹39,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఉచిత ధోతీ పంపిణీ మరియు 100 రోజుల ఉపాధి పథకం MGNREGA కూడా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన అన్నారు.

“డీఎంకే ఇసుక అవినీతి మరియు విద్యుత్ అవినీతితో సహా వివిధ అవినీతి కార్యకలాపాలకు పాల్పడింది. వారు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు” అని ఆయన అన్నారు.

ఏఐఏడీఎంకే నాయకులు కేపీ మునుసామి, ఎస్పీ వేలుమణి మరియు తంగమణి కూడా ఎడప్పాడితో ఉన్నారు.

మార్చి 25న ఎడప్పాడి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలోని షా నివాసంలో ఆయనను సందర్శించిన తర్వాత తమిళనాడులో సంబంధాలను పునరుద్ధరించే చర్యలు బహిరంగంగా వెలువడ్డాయి.

అమరావతి దూసుకుపోతుందా ?

అమరావతి దూసుకుపోతుందా ?

ఆంధ్రుల రాజధాని అమరావతి నిజంగానే దూసుకుపోతుందా? కూటమి నేతలు చెపుతున్నట్టు ‘ప్రపంచంలోనే టాప్ – 5 సిటీస్ ‘ లో చోటు దక్కించుకుంటుందా ? వీరు చేస్తున్న ప్రకటనలకు , ఫీల్డ్ లో జరుగుతున్న పనులకు పొంతన కనిపిస్తుందా ? కనీసం పదేళ్ళకయినా ప్రపంచ నగరాలతో పోటీపడే ప్లాన్ తో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ?

ఈ నేపథ్యంలో నాలుగైదేళ్ల వరకు అమరావతి ప్రాంతంలో భూముల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అయితే ప్లాట్లు యజమానులు మాత్రం …. ఇపుడు ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం అయితే . .. ఐదారు నెలలలోనే గజం లక్షకు పెరుగుతుందని ఆశతో ఉన్నారు.

హైదరాబాద్ ఎఫెక్ట్ : 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రా నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తరలిపోయాయి . ఆ సమయంలో హైదరాబాద్ మంచి హైప్ లో ఉంది. అక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి భూములు , విల్లాలు కొనుగోలు చేశారు . ఇటీవల రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచున సాగుతోంది . ఈ నేపథ్యంలో అక్కడ విక్రయించి . . అమరావతిలో పెట్టుబడులు పెడదామని భావిస్తున్న ఆంధ్రులకు అవకాశం దొరకడంలేదు . దీంతో అమరావతికి వచ్చే పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు భావిస్తున్నాయి.

పదేళ్ల సమయం పడుతుంది : అమరావతి విశ్వనగరంగా అవతరించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది . ఇపుడు జరుగుతున్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా . .. 2029 లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు కొనసాగుతాయి . పొరపాటునో , గ్రహపాటునో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అమరావతిని మళ్ళీ భ్రష్టు పట్టించారని చెప్పలేం . .. ఇదే కారణంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ పెట్టుబడిదారులు తటపటాయిస్తున్నారు . దీనిపై కూటమి సర్కార్ , ,, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని జనంలో బలమైన నమ్మకం కలిగేలా చేయగలగాలి . లేకపోతె చంద్రబాబు చెపుతున్న కబుర్లకు , జరుగుతున్న పనులకు కొంత గ్యాప్ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కలగదు. దీనిని కూటమి నేతలు గుర్తెరగాలి .

లోకేష్ కి టీడీపీ పగ్గాలు :  పిఠాపురం వర్మ

లోకేష్ కి టీడీపీ పగ్గాలు : పిఠాపురం వర్మ

”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు.  కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు. 

పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .

కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .

ట్రంప్ – మస్క్ మధ్య చెడిందా ?

ట్రంప్ – మస్క్ మధ్య చెడిందా ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల మంట.. తన సన్నిహితుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మంట పెడుతోంది.

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సన్నిహితుడు ఎలాన్‌ మస్క్‌ మధ్య టారిఫ్ ల వ్యవహారం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది . ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని ఓ అమెరికన్‌ మీడియా సంస్థ తాజాగా ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ చేసింది . సుంకాలు విధించ వద్దని మస్క్‌ ఎంత చెప్పినా ట్రంప్‌ వినలేదనేది ఆ కధనం సారాంశం . వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుడు బల్ల గుద్ది మరీ చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారడంతో ట్రంప్ పై మస్క్‌ గుర్రుగా ఉన్నట్లు సదరు కధనం స్పష్టం చేసింది .

నాలుగు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషించారు . తన ట్విటర్ (X ), ఇతర ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా అమెరికా ప్రజలలో ట్రంప్ వైపు తిప్పడంలో క్రియాశీల పాత్ర పోషించారు .

ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్‌ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్‌ సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ అమెరికన్‌ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత మిల్టన్‌ ఫ్రైడ్మాన్‌ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడమే ఇందుకు నిదదర్శనం. అంతేకాదు, యూర్‌పతో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. అయితే, సుంకాలపై మస్క్‌ వైఖరిని ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్‌, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్‌, వైట్‌హౌ్‌సకు మధ్య అగాధం పెరిగిందన్న వార్తలను ఇది మరింత బలపరుస్తోంది.

రూ.11.61 లక్షల కోట్లు హాంఫట్  ట్రంప్‌ సుంకాల దెబ్బకు మస్క్‌ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్ల (రూ.11.61 లక్షల కోట్లు) మేర తరిగిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు (రూ.25.80 లక్షల కోట్లు) పడిపోయింది. గత గురు, శుక్రవారాల్లోనే మస్క్‌ నెట్‌వర్త్‌ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం వాటిల్లబోతోందని టెస్లా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు .

ఇంజనీర్స్ చేతులెత్తేశారు-రైతు చేసి చూపించాడు

ఇంజనీర్స్ చేతులెత్తేశారు-రైతు చేసి చూపించాడు

లోతైన గోతిలోకి . . పెద్ద యంత్రాన్ని దించే పనిలో రైతు ఉపాయం గ్రేట్ … ముప్పయ్ – నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది కధ లాంటి నిజం . . 2 నిముషాలు కేటాయించి చదవండి..

కేరళ రాష్ట్రంలో అలెప్పి సమీపంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు . ఆ ప్లాంట్ కనస్ట్రక్షన్ సమయంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది . . ఫ్యాక్టరీలో లోతైన గొయ్యి తవ్వారు. ఆ గొయ్యిలో ఒక భారీ యంత్రం పెట్టాలి. కానీ ఆ యంత్రం చాలా బరువుగా ఉండడం వల్ల దాన్ని లోపల పెట్టడం కష్టంగా మారింది.

యంత్రం సైట్‌కి తీసుకొచ్చారు. కానీ 30 అడుగుల లోతైన గుంతలో దించడం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది!

యంత్రాన్ని సరిగ్గా ఉంచకపోతే, ఫౌండేషన్‌కి మరియు యంత్రానికీ నష్టం కలుగుతుంది.

అప్పుడు (1980-85 మధ్య కాలంలో ) పెద్ద బరువులు ఎత్తగలిగే క్రేన్లు అంతగా అందుబాటులో లేవు. కొన్ని క్రేన్లు ఉండవచ్చు, కానీ అవి ఆ లోతు వరకు దించలేవు. దించినా సేఫ్ గా దించడం సాధ్యం కాదని ఇంజినీర్లు చేతులెత్తేశారు.

చివరికి ఆ కంపెనీ ఇంజినీర్లు , ఇతర నిపుణులు తాము చేయలేమని తేల్చేసి, ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపుతారో తెలుసుకోడానికి టెండర్ పిలిచారు . చాలా మందే తమ తమ ఐడియాలు పంపారు. ఎక్కువమంది క్రేన్ వాడే ఆలోచనతోనే వచ్చారు.

వాళ్లు 10 నుంచి 15 లక్షల వరకు టెండర్ కోడ్ చేశారు.

అయితే, ఆ ఊరికి సమీపంలో ఉండే ఒక రైతు వచ్చి కంపెనీ ఇంజినీర్లను అడిగాడు:

“ఈ మెషిన్ నీటిలో తడిసితే ఏమైనా సమస్య ఉంటుందా?”

కంపెనీ ఇంజినీర్లు : “ఏమీ సమస్య లేదు.”

అయితే ఆ రైతు కూడా టెండర్ వేసాడు. కానీ అతడు కేవలం 5 లక్షలకె పని పూర్తిచేస్తామని కోడ్ చేసాడు . అందుకే ఆ పని అతనికే అప్పగించారు.

అయితే ఆశ్చర్యంగా, అతను తన ప్లాన్ చెప్పలేదు. “నా దగ్గర ఈ పని చేయగలిగే టీమ్ ఉంది, నేను పనిని పూర్తి చేస్తాను” అని మాత్రమే అని వెళ్ళిపోయి . . మరుసటి రోజు వచ్చాడు .

రాగానే కంపెనీ ఉద్యోగులు, మేనేజర్లు, బాస్ అందరూ ఆ పని ఎలా చేస్తాడో చూడడానికి ఉత్కంఠగా ఎదురుచూశారు.

సైట్‌కి ఎటువంటి ప్రిపరేషన్ కనిపించలేదు. కానీ నిర్ణయించిన సమయానికి చాలా ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రక్కులన్నీ మంచు పలకలతో నిండినవి. ఆ మంచు బ్లాక్‌లను గుంతలో వేసారు.

ఆ తరువాత యంత్రాన్ని తీసుకొచ్చి, మంచు బ్లాక్‌ల మీద పెట్టారు.

తరువాత మినీ వాటర్ పంప్‌ ద్వారా గుంత నుంచి నీటిని బయటకి పంపారు. మంచు కరిగిపోయింది, నీరు తిసే కొద్దీ యంత్రం క్రిందకి దిగింది.

4-5 గంటల్లోనే పని పూర్తయ్యింది. మొత్తం ఖర్చు లక్ష రూపాయల లోపే అయ్యింది.

యంత్రం సరిగ్గా స్థిరంగా అమరింది. ఆ వ్యక్తికి నాలుగు లక్షల పైన లాభం వచ్చింది!

ఇది చూస్తే తెలుసుతుంది – వ్యాపారం అయినా , వ్యవహారం అయినా తెలివిగా , సులువుగా చేయడానికి చదువు ఒక్కటే సరిపోదు . అనుభవం , సమయస్ఫూర్తి , సందర్భానుసారం.. వ్యవహార జ్జ్ఞానం ముఖ్యమని . . .

సమస్యలకు సింపుల్ సొల్యూషన్ కనుగొనడం ఒక కళ. అది మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది.

ఆ మనిషి తన ఆచరణాత్మక జ్ఞానంతో పెద్ద సమస్యకు సులభమైన పరిష్కారం చూపించి . . ఇంజినీర్లను సైతం నోటిమీద వేలువేసుకునేలా చేసాడు. పదిమందితో శబాష్ అనిపించుకున్నాడు .