టారిఫ్ లలో ఏ దేశానికీ మినహాయింపు లేదట

టారిఫ్ లలో ఏ దేశానికీ మినహాయింపు లేదట

“అమెరికా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు కలిగిన, నాన్‌ మానిటరీ టారిఫ్‌ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి మినహాయింపు లభించదు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎలాంటి టారిఫ్‌ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు అన్నీ 20% ఫెంటనిల్‌ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్‌ బకెట్‌లోకి మారాయి.” డొనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వాళ్ళ చేతిలో బందీలుగా ఎందుకు ఉండాలి ?
“నేషనల్‌ టారిఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సెమీకండెక్టర్లు సహా, అమెరికా ప్రజలకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ సామగ్రిని పరిశీలించాం. దీనిని బట్టి దేశీయంగా వాటిన్నింటినీ ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి, గతంలో ఇతర దేశాలు ఎలా వ్యవహరించాయో చూశాం. ముఖ్యంగా చైనా, అమెరికా పట్ల ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే, మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా, బలమైందిగా మార్చబోతున్నాం.అప్పుడు మాత్రమే మనం చైనా కబంద హస్తాల్లో బందీగా మారకుండా ఉంటాం. డ్రాగన్‌ అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని బాగా వాడుకొంటోంది. దానిని నేను కొనసాగనీయను. ఇక ఆ రోజులు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను నియంత్రణ వల్ల భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

అమెరికాలో తయారీపై ఫోకస్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై చైనాతో సహా పలు దేశాలపై ఆధారపడుతూ వస్తుంది . ఇకపై వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడంపై దృష్టిపెట్టినట్లు లుట్నిక్‌ చెప్పారు. “మాకు సెమీకండక్టర్లు, చిప్స్‌, ఫ్లాట్‌ ప్యానల్స్‌ చాలా అవసరం. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇకపై మాకు అవసరమైన వస్తువుల కోసం, ఆగ్నేయాసియాపై ఆధారపడదల్చుకోలేదు. అందుకే వారిని రివెంజ్ టారిఫ్‌ల నుంచి మినహాయించి, సెమీకండక్టర్‌ పన్నుల పరిధిలోకి తీసుకొద్దామని ట్రంప్‌ అంటున్నారు. బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సెమీకండక్టర్ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది” అని లుట్నిక్‌ పేర్కొన్నారు.

 

ట్రంప్ టారిఫ్ – పప్పు ధాన్యాల సాగుపై ప్రభావం ఏ మేరకు ?

ట్రంప్ టారిఫ్ – పప్పు ధాన్యాల సాగుపై ప్రభావం ఏ మేరకు ?

‘మోదీ నా స్నేహితుడు . .’ అంటూనే ట్రంప్ మనపై భారీగా సుంకాల భారం మోపుతున్నాడు

భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులపై 27 శాతం సుంకాలు వహించారు ట్రంప్. అయితే మనదేశం నుంచి అమెరికాకు గతంలో పప్పు ధాన్యాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. ఇటీవల కాలంలో మనమే ఇతర దేశాల నుంచి పప్పు ధాన్యాల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ట్రంప్ సుంకాలు మనదేశంలో పప్పు ధాన్యాల సాగుచేసే రైతాంగంపై ఏ మాత్రం పడటంలేదనే చెప్పాలి . ఎందుకంటే మనం సాగుచేసే పప్పులు మనకే సరిపోవడంలేదు .

ఆస్ట్రేలియా , తాంజానియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది . మనదేశంలో సాగవుతున్న కొన్ని పప్పు ధాన్యాలను మాత్రం కొద్దిగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు . ఇవి పెద్దగా ప్రభావవంతమైన ఎగుమతి కాదనే చెప్పాలి .

”భారతదేశం అధిక సుంకాలను విధిస్తోంది. ఇది భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా వారిని నిరోధిస్తుంది;; అనిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు . భారతదేశంతో వ్యవసాయ వాణిజ్యానికి సంబంధించి అనేక ఇతర దేశాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన చేస్తున్న అభియోగాలలో వాస్తవం ఎంత ?

భారతదేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి 2013-14 ఆర్థిక సంవత్సరం (FY)లో 19.25 మిలియన్ మెట్రిక్ టన్నుల (MT) నుండి 2014-15లో 17.3 మిలియన్ MTకి పడిపోయింది. 2014-15 మరియు 2015-16లో తరువాతి కరువు సంవత్సరాల కారణంగా ఇది మరింత తగ్గింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం భారతదేశం పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ పప్పుధాన్యాల దిగుమతులు ఆగలేదు.

2014-15లో 4.5 మిలియన్ టన్నులుగా ఉన్న పప్పుధాన్యాల దిగుమతిని 2015-16లో 5.8 మిలియన్ టన్నులకు ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్-జూలై, 2016లో, భారతదేశం ₹6,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో దాదాపు 1.26 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. 2017లో దిగుమతులు 6.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2018లో 5.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2023-24లో దిగుమతులు 4.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు కొనసాగాయి. దిగుమతులను నిరంతరం పెంచుతూ సేకరణ పరిమితులపై ఆంక్షలు విధించడం ద్వారా అదనంగా కొనసాగుతోంది.

తూర్, మసూర్ మరియు ఉరద్ పప్పుల విషయంలో, వాస్తవ ఉత్పత్తిలో 25 శాతం సేకరణ పరిమితిని 2023-24 మరియు 2024-25 సంవత్సరాలకు మాత్రమే ఎత్తివేశారు .

పెరుగుతున్న పప్పుధాన్యాల ధరలు, డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరం అంచనావేయాలి.  పప్పుధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం, తప్పనిసరి దిగుమతులు మరియు సేకరణపై పరిమితులను ప్రస్తావించకుండా, ప్రభుత్వం 2015-16లో దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ఉత్పత్తి 163.23 లక్షల టన్నుల నుండి 2023-24లో 244.93 లక్షల టన్నులకు పెరిగిందని క్రమం తప్పకుండా ప్రకటిస్తోంది. ఈ ప్రకటన క్షేత్ర స్థాయి లెక్కలకు సరిపోవడంలేదు.  దిగుమతులపై ఆధారపడి వ్యతిరేక మార్గాన్ని తీసుకున్నప్పటికీ, భారతదేశం స్వావలంబన సాధిస్తున్నామని చేస్తున్న ప్రకటనలపై అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి .

2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ పప్పుధాన్యాల దిగుమతులు గత ఆరు సంవత్సరాలలో అత్యధిక స్థాయికి 84 శాతం పెరిగాయి. పప్పుధాన్యాల దిగుమతి 2014 మరియు 2015లో సుంకం లేకుండా ఉంది, దీని ఫలితంగా 2016-17లో రికార్డు స్థాయిలో 6.6 మిలియన్ మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యాయి.

పప్పుధాన్యాల దిగుమతులు ప్రధానంగా కెనడా, మయన్మార్, ఆస్ట్రేలియా, మొజాంబిక్ మరియు టాంజానియా నుండి వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కెనడా నుండి ఎర్ర కాయధాన్యాలు (మసూర్) దిగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా 1.2 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి . “భారతదేశంలో పప్పుధాన్యాలు మరియు తినదగిన నూనెలను ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగం దిగుమతి చేసుకుంటుంది” అని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.    

ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, వినియోగదారుడిగా, ఇప్పుడు దిగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ పప్పు ధాన్యాల వినియోగంలో దాదాపు 27 శాతం భారతదేశం వాటా కలిగి ఉంది. ప్రపంచంలోని పప్పు ధాన్యాలలో భారతదేశం దాదాపు 25 శాతం ఉత్పత్తి చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

  

విటమిన్ – డి లోపం.. సరిదిద్దుకోవచ్చు కదా?

విటమిన్ – డి లోపం.. సరిదిద్దుకోవచ్చు కదా?

భారతదేశంలో సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ఉష్ణమండల దేశం. 8-9 గంటలపాటు సూర్యుడు మనల్ని వెన్నంటే ఉంటాడు.  అయినా  ఎక్కుమందిలో  విటమిన్ డి లోపం ఎందుకు ఏర్పడుతుంది? 

ఈ వైరుధ్యం ప్రధానంగా ఆధునిక జీవనశైలి, సన్‌స్క్రీన్‌ల వాడకం పెరగడం, UVB కిరణాలను నిరోధించే వాయు కాలుష్యం మరియు శరీర దుస్తులు ధరించడం.. వంటివి కారణాలుగా చెపుతున్నారు . -కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, మానసిక స్థితి నియంత్రణలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం కారణంగా బలహీనమైన ఎముకలు, అలసట, కండరాల నొప్పి, తక్కువ రోగనిరోధక శక్తి వంటివీ కారణమవుతున్నాయి .

పెద్దలలో, విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమలేసియా అనే సమస్య వస్తుంది. దీనిలో భాగంగా, మన ఆహారంలో కాల్షియం శోషణ లేకపోవడం వల్ల, ఎముకలు సులభంగా విరగడం, కండరాలు, కీళ్ళు మరియు కీళ్లలో నొప్పి, బలహీనమైన దంతాలు మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు సంభవిస్తాయి.

  • విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి కొన్ని నియమాలు – ఇంకొన్ని చిట్కాలు
  • ప్రతిరోజూ సూర్యకాంతిలో కనీసం 20 నిమిషాలపాటు ఉండండి. మీ చర్మపు రంగును బట్టి, మీ ముఖం, చేతులు మరియు కాళ్ళను ఉదయం 8–10 గంటల మధ్య 10 నుండి 30 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేయండి.
  • ఈ సమయంలో సన్‌స్క్రీన్‌ను వాడకండి . ఎందుకంటే ఇది విటమిన్ డి ఉత్పత్తికి అవసరమైన UVB కిరణాలను అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్‌కు గురికావడం వల్ల చర్మం సహజంగా విటమిన్ D3ని సంశ్లేషణ చేస్తుంది.
  • . మీ ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు, అంటే ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు, నారింజ రసం, తృణధాన్యాలు తీసుకోండి. భారతదేశంలో, అనేక ప్యాక్ చేసిన పాల ఉత్పత్తులు మొక్కల ఆధారిత పాలు ఇప్పుడు ఫోర్టిఫైడ్ గా వస్తున్నాయి, ఇది ముఖ్యంగా శాఖాహారులకు ఉపయోగకరమైన ఆహార వనరు.

ఊబకాయం ఉన్నవారిలో కూడా విటమిన్ డి ఉత్పత్తి సరిగ్గా జరగదు. మన చర్మంలోని మెలనోసైట్లు (చర్మ రంగుకు కారణమైన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి) సూర్యునిలోని UV కిరణాలను గ్రహిస్తాయి, విటమిన్ డి ఉత్పత్తిని నిరోధిస్తాయి. అందుకే, సూర్యకాంతి ఉన్నప్పటికీ, మన దేశంలో విటమిన్ డి లోపం చాలా ఎక్కువగా ఉంటుంది.

  • వారానికోసారి కొవ్వు చేపలు తినండి సాల్మన్, సార్డిన్స్ మరియు మాకేరెల్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డి యొక్క అద్భుతమైన సహజ వనరులు.
  • . అవసరమైనప్పుడు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి. వైద్యులు తరచుగా వారానికి లేదా నెలవారీ మోతాదులలో విటమిన్ డి 3 సప్లిమెంట్లను (కొలెకాల్సిఫెరోల్) సూచిస్తారు.
  • గర్భిణీ తల్లికి విటమిన్ డి లోపం ఉంటే, పుట్టబోయే బిడ్డకు ఆ లోపం వచ్చే అవకాశం ఉంది. నవజాత శిశువులలో విటమిన్ డి లోపం సరిదిద్దకపోతే, ఎముకలు మరియు కండరాలు బలహీనపడతాయి మరియు దాని ప్రభావాలు జీవితాంతం ఉంటాయని మర్చిపోకండి .
అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై గంటల వ్యవధిలోనే చర్యలు

భువనేశ్వరి, చంద్రభాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ , హోంమంత్రి అనిత, తదితరులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేశారా ?

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ని పార్టీ నుంచి సస్పండ్ చేసి , , వెంటనే అరెస్ట్ చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడ్డారని ప్రజలలో మంచి పేరు సంపాదించారు. ఈ ఎపిసోడ్ లో పార్టీకి కూడా మైలేజ్ వచ్చింది. ఇంతవరకు ఒకే . కిరణ్ ని అరెస్ట్ చేయడం , సస్పండ్ చేయడం లో ఎవరికీ అభ్య0తరాలు లేవు . ‘తప్పు చేస్తే తమవాడైన వదిలేది లేదు . ‘ అనే సంకేతం పార్టీకి , ప్రభుత్వానికి మంచిదే . కానీ , అరాచకాలు చేసిన అవతలివాళ్ళను మాత్రం వదిలేస్తాం . . మనవాళ్లయితే లోపలేస్తాం . . అన్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు ధోరణి.. అంటూ టీడీపీ సీనియర్ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయ్ .

అంతకుముందు . .. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. తప్పు తెలుసుకుని తర్వాత క్షమాపణ కూడా చెప్పలేదు . భారతిపై వ్యాఖ్యలు చేసిన కిరణ్ తప్పు తెలుసుకుని ”అలా మాట్లాడటం తప్పే ‘ ‘ అని లెంపలేసుకున్నాడు . అయినా అరెస్ట్ చేశారు . తప్పు అని చెప్పినా వదలమని కాదు . గతంలో భువనేశ్వరి , వంగలపూడి అనిత , చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ వంటి నేతలపై అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డారు . ఒకరోజు , రెండు రోజులు కాదు . . నెలల తరబడి జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు . చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు . అరాచకవాదుల ఆట కట్టిస్తాడనుకున్నారు . కానీ ఒకరిద్దరిని లోపలేశారు . చేతులు దులుపుకున్నారు . . అన్నట్లు చేస్తున్నారు . వైసీపీ అరాచకవాదులు ఇంకా పదుల సంఖ్యలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై చర్యలకు కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడానికి కారణాలపై టీడీపీ , జనసేన కేడర్ లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి . వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నే ఉంది .

నాసా బంపర్ ఆఫర్​! ఆ  సలహా ఇస్తే రూ.25కోట్లు

నాసా బంపర్ ఆఫర్​! ఆ సలహా ఇస్తే రూ.25కోట్లు

చంద్రుడిపై దాగి ఉన్న విశ్వ రహస్యాలను శోధించేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు.