విజయసాయి రెడ్డి బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట . ఇలాంటి నేతలను చేర్చుకుంటే వాళ్లపై ఉన్న అవినీతి , అరాచక మచ్చలు తమ పార్టీపై పడతాయన్న భావం కొందరు అసలైన బీజేపీ నేతలలో ఉంది . అయితే ఏపీలో మన పార్టీ ప్రభావం ఎంత ? దీనిగురించి ఎన్నికల నాటికీ జనం మర్చిపోతారులే . . అని వైసీపీకి మద్దతుగా నిలిచే ఒకరిద్దరు బీజేపీ నేతలే అధిష్టానానికి రికమండ్ చేస్తున్నారట .
ఆవిర్భావం నుంచీ సాయిరెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డికి నమ్మకమైన సహాయకుడిగా ఇన్నాళ్లూ వ్యవహరించారు. 2019 లో అధికారంలో ఉన్నపుడు వైసీపీలో విజయసాయి నెంబర్-2 గా వెలుగోదరు. జగన్కి- అతనికి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ… ఈ సంవత్సరం జనవరిలో, విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
కాకినాడ పోర్టు కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ మరియు వైఎస్‌ఆర్‌సిపి పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో ఉన్న విజయసాయి రెడ్డి క్రియాశీల రాజకీయాలను విడిచిపెట్టి, జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్‌ఆర్‌సిపికి దూరమై, తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినా . .. విజయసాయి రెడ్డి మాటలను జనం నమ్మలేదు .
ఒకే చాయిస్: విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక చాయిస్ బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అతనిపై ఈడీ , సీబీఐ కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా బీజేపీ యేతర పార్టీ గురించి ఊహించడానికే సాహసించలేని పరిస్థితి.
“ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాషాయ పార్టీ కూడా ఆయనను స్వాగతించడానికి చాలా ఆసక్తిగా ఉంది. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. విజయసాయి రెడ్డి చేరిక టిడిపితో ఉన్న ముఖ్యమైన పొత్తులో చికాకు కలిగించకూడదని బిజెపి కోరుకుంటోంది” అని విజయసాయి రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు.
“ఇక మిగిలి ఉన్నది నాయుడు నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) మాత్రమే.” అనేది సదరు నేత అభిప్రాయం .