అనంతబాబుకు బిగుస్తున్న ఉచ్చు – డెడ్​బాడీ డోర్‌ డెలివరీ కేసు

Srinivas Vedulla

వైసీపీ అధికారంలో ఉన్న్డపుడు దళిత యువకుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన కేసులో ఆ పార్టీ MLC అనంతబాబు అలియాస్ అనంత ఉదయ భాస్కర్ పై ఉచ్చు బిగుస్తోంది . – కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది .

 వీధి సుబ్రహ్మణ్య0. ఒకప్పుడు అనంత్ బాబు కారు డ్రైవర్. ఉద్యోగం మానేసిన తర్వాత అతన్ని హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్లు YSRCP MLC అనంతబాబుపై ప్రధాన అభియోగం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయ అనుచరుడిగా పేరొందిన అనంతబాబు తూర్పు మన్యంలో రెండున్నర దశాబ్దాలుగా అరాచకాలకు పాల్పడుతున్నా అతనికి అన్ని పార్టీలలోనూ ఉన్న బంధు గతం కాపలా కాస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి .

కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.

కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్‌ డెలివరీ చేశారన్న నేరారోపణలపై నమోదైన కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

తన మాజీ డ్రైవర్‌ను తానే హత్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తరువాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసు అధికారులు చక్రం తిప్పారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి . . ఈ క్రమంలో మధ్యంతర బెయిల్‌ పొందిన అనంతబాబు రెండేళ్లుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.

లోతైన విచారణకు డిమాండ్ . .. సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్‌ 14న అనుబంధ ఛార్జిషీట్‌ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్‌ వేయకుండా నిందితుడికి బెయిల్‌ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చేలా హత్య జరిగినప్పుడు అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్‌ నుంచి ఎవరెవరితో మాట్లాడారో పోలీసులు తేల్చడానికి ప్రయత్నించలేదు . ఘటనా స్థలంలో ఎవరున్నారో టవర్‌ లోకేషన్, గూగుల్‌ టేక్‌అవుట్, సీసీ ఫుటేజీలతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్‌మెన్లనూ సమగ్రంగా విచారించలేదు. దీనిపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయ్ .

.

 సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీసు అధికారులు, గత ప్రభుత్వం సహకరించిందని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. యువకుడి శరీరంపై 31, అంతర్గతంగా మరో మూడు గాయాలు చేయడం ఒక్కరివల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో మరింతమంది ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు విచారణ చేయలేదన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తానని ముప్పాళ్ల సుబ్బారావు ‘అభిన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు .

You May Also Like…