Danger: ఇండియాకి ఎయిర్ పొల్యూషన్ డేంజర్

Srinivas Vedulla

April 17, 2025

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు దూరంగా భారత్‌- డైరెక్టర్‌ మరియా నీరా కీలక వ్యాఖ్యలు

“గుండె జబ్బులు, కేన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌లు (NCDs) రావడానికి వాయు కాలుష్యం ఒక కారణం. సెప్టెంబర్‌లో జరగబోయే యూఎన్‌ జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై లోతుగా చర్చ జరుగుతుంది. వాయు కాలుష్యంపై మనం పోరాడుతున్నప్పుడు, NCDల ముప్పు కూడా తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు WHO మార్గదర్శకాల కంటే చాలా దారుణమైన గాలి నాణ్యతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాలు మరింత దారుణమైన స్థాయికి చేరుకున్నాయి” – –  డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ వింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira)

భారత దేశంలో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన సాధారణ ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వంట చేసుకోవడానికి కాలుష్య కారకాలైన కట్టెలు, పిడకలను ఉపయోగిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira), ఆందోళన వ్యక్తం చేసారు . భారత్‌లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు అవసరమని నీరా సూచించారు .

డాక్టర్ నీరా ఇటీవల పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . .. , గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఎల్‌పీజీ సబ్సిడీ వంటి పథకాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. “పథకాల నుంచి మంచి ఫలితాలను చూశాం. కానీ 41% భారతీయ గృహాలు ఇప్పటికీ బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.” అని స్పష్టం చేసారు .

You May Also Like…