అమరావతి రైతులలో అలజడి..

Srinivas Vedulla

మరో 44 వేల ఎకరాలు తీసుకుంటే,, ఈ భూములు ఎవరు కొంటారు ? రెండవ దఫా భూ సమీకరణ చేపడతారన్న భయంతో ముందు తీసుకున్న భూముల లావాదేవీలపై స్తబ్దత

అమరావతి రైతులతో కూటమి సర్కార్ ఆటలాడుకుంటోంది. గతంలో సమీకరించిన 33 వేల ఎకరాల రైతులకు పూర్తిగా ప్లాట్స్ కేటాయింపు ప్రక్రియ జరగకుండానే . . రెండో దఫా పూలింగ్ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తోంది.

గందరగోళంలో రియల్ ఎస్టేట్ : అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టడానికి కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తున్న వార్తలు రావడంతో ఈ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వేల ఎకరాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరో 44 వేల ఎకరాల సమీకరణ చేస్తే . .. ఈ ప్రాంతంలో భూముల ధరల గణనీయంగా తగ్గుతాయన్న అంచనాలు వస్తున్నాయ్ . ఈ ప్రభవవంతో 2nd పేజ్ – లాండ్ పూలింగ్ లీకులు వచనప్పటి నుంచి 29 గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలపై నీలినీడలు అలుముకున్నాయి .

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరిస్తే.. విజయవాడ సమీపంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది . దీనికి 1200 ఎకరాల భూమి గతంలో సేకరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించాలంటే . . దీనికే మరో 2 వేల ఎకరాల భూసమీకరన్ చేస్తే సరిపోతుంది. రాజధాని భూ సమీకరణ ప్యాకేజ్ టైప్ లో చేస్తే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు . చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఐటీ , AI వంటి కార్యాలయాలు ఉంటె బాగుంటుంది . ఇదే విమానాశ్రయం సమీపంలో, లేదా విమానాశ్రయానికి చేర్చి . . మరో 4,5 వేల ఎకరాల భూమి తీసుకునే విధానాన్ని చంద్రబాబు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆందోళనలో అమరావతి రైతులు : ”చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలయింది . ఆరేడు నెలలుగా రైతుల ప్లాట్లలలో మొలిచిన తుప్పలనే ఇంకా తొలగించలేకపోయారు . అలాంటిది మిగిలిన నాలుగేళ్లలో ఏమి చేయగలరు ? ఎంతవరకు చేయగలరు ? కొత్త నగరం నిర్మించాలంటే కావాల్సిన ప్రాధమిక రహదారులు శరవేగంగా నిర్మిస్తే అభివృద్ధి దానంతట అదే నడుస్తుంది . ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోవడంలేదు . విశ్వ నగరం నిర్మిస్తా . .. అంటూ ప్రగల్బాలు పలుకడం మానుకోవాలి . ” అంటూ తుళ్లూరుకు చెందిన చాగంటి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు .

”ల్యా0డ్ పూలింగ్-2 అంశం తెరపైకి తేవడం వల్ల . .. ఇపుడిపుడే నడుస్తున్న అమరావతి రియల్ ఎస్టేట్ పై పిడుగుపడినట్లయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత పెరుగుతుంది. విశ్వాసం కోల్పోయి తర్వాత అమరావతిని , రాష్ట్రాన్నీ ముంచేస్తారన్న భయం కలుగుతుంది . .. ‘ అని వెలగపూడి కి చెందిన ”శివన్నారాయణ అనే ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేసారు .

చంద్రబాబు నుంచి అమరావతిని కాపాడాలి : ‘ గతంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి అమరావతికి విముక్తి కలిగించాలని ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాం. ఎన్నో ఆందోళనలు చేసాం . చంద్రబాబు వచ్చారని ఎంతో సంబరపడ్డాం . కానీ ఇతని పిచ్చి ఆలోచనలు చూస్తుంటే వీళ్ళే అమరావతిని ముంచేస్తారనిపిస్తోంది . .” అని వడ్లమానుకు చెందిన రాజధాని ఉద్యమ మహిళా నాయకురాలు చెప్పుకొచ్చారు .

You May Also Like…