అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .
మోదీ సభకు ఏర్పాట్లు ఇవిగో.. అతి భారీగా
మూడు వేదికలు - ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన...