ఇద్దరు స్నేహితులు నిర్మించిన సామ్రాజ్యం..మైక్రోసాఫ్ట్

Srinivas Vedulla

April 6, 2025

బిల్ గేట్స్ – పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 ఏళ్లయింది . ..

అల్లరి – చిల్లరగా తిరిగే వయసు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి కూడా పెద్దగా ఫోకస్ పెట్టే మెచ్యూరిటీ కూడా కాని ఆ వయసులో ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన చిన్న సంస్థ . .ఇపుడు ప్రపంచ స్థాయిలో దిగ్గజ కంపెనీగా ఎదిగింది.

1975 ఏప్రిల్ 4న ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన సంస్థ . . .. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని వాటిని గుణపాఠాలుగా మలచుకుని . . విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది . ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితులు నిర్మించిన ఈ మైక్రోసాఫ్ట్ అప్రతిహత విజయదరహాసాన్ని ఒకసారి నెమరువేసుకుందాం . …

మైక్రోసాఫ్ట్ ప్రారంభం: ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బిల్ గేట్స్, పాల్ అలెన్​కు వచ్చిన ఒక చిన్న ఆలోచనతో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ జన్మించింది . ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలనేది అప్పట్లోనే ఈ ఇద్దరు స్నేహితుల కల . ఎందుకంటే ఆ సమయంలో కంప్యూటర్లు పెద్దవిగా ఉండటం, ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని వినియోగించడం క్లిష్టంగా ఉండేది.

వారి ఇరువురి పురోగతి MS-DOS (మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్) తో మొదలైంది. ఇది పర్సనల్ కంప్యూటింగ్‌కు పునాది వేసిన ప్రారంభ ఆపరేటింగ్ సిస్టమ్ (OS).

1975-1980: బిల్ గేట్స్, పాల్ అలెన్ అందరికీ పర్సనల్ కంప్యూటింగ్‌ను తీసుకురావాలనే విజన్​తో పనిచేశారు. ఈ క్రమంలో వారు మొట్టమొదటి వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటైన ఆల్టెయిర్ 8800 కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి వారి మొదటి పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కార్పొరేషన్లలో ఒకటిగా ఎదిగింది.

1975: బిల్ గేట్స్, పాల్ అలెన్ ఇద్దరూ కలిసి 1975 ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. ఆల్టెయిర్ BASICను అభివృద్ధి చేసి ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌కు మారింది. ఈ క్రమంలో 1979-1978 చివరి నాటికి దీని సేల్స్ $1 మిలియన్లకు చేరుకున్నాయి.

1981-1990: ఇది మైక్రోసాఫ్ట్‌ను ఇంటింటికి పరిచయం చేసిన దశాబ్దం. ఆగస్టు 1981లో మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ (MS-DOS)ను విడుదల చేసింది. ఇది IBM పర్సనల్ కంప్యూటర్లలో పనిచేయడం ప్రారంభిస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగత కంప్యూటింగ్ వ్యవస్థలపై కంపెనీ ఆధిపత్యానికి ఇది కీలకమైన క్షణం.

1983: 1983లో మైక్రోసాఫ్ట్ తన కొత్త సాఫ్ట్‌వేర్ ‘విండోస్’ను సాగరవంగా ప్రకటించింది. ఇది విజువల్ ఫీచర్లతో MS-DOS ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

1985: 1985లో విండోస్ 1.0 విడుదలైంది. ఇది కంప్యూటింగ్‌ను రూపొందించే గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేసిన కీలక కంపెనీ .

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 1985: 1985లో మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0ని ప్రారంభించింది. ఈ విధానంలో కంప్యూటర్లను ఉపయోగించడాన్ని చాలా సులభతరం చేయడంలో ఒక టర్నింగ్ పాయింట్. మైక్రోసాఫ్ట్ సంవత్సరాలుగా విండోస్‌ను మెరుగుపరుస్తూనే ఉంది. వీరు రూపొందించిన ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌గా మారింది.

1986: మైక్రోసాఫ్ట్ తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌కు మార్చింది. ఇది ఒక్కో షేరుకు $21 చొప్పున పబ్లిక్‌గా విడుదలైంది. తర్వాత ఇది దాదాపు $60 మిలియన్లను సేకరించి విజ యం సాధించారు . . దీంతో బిల్ గేట్స్ 31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా మారడానికి ఇది కారణంగా నిలిచింది .

1987: మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల కోసం వరల్డ్ లోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థగా అవతరించింది.

1988: 1987లో విండోస్ 2.0 రాకతో, కార్యాలయంలో కంప్యూటర్లు అనేవి సాధారణం కావడం ప్రారంభమైంది. దీంతో ప్రపంచ అమ్మకాల ఆధారంగా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద PC సాఫ్ట్‌వేర్ కంపెనీగా అవతరించింది.

ఇంటర్నెట్ అండ్ ఎక్స్​పెన్షన్ 1990: 1990లలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ప్రవేశపెట్టింది. సర్వర్ సాఫ్ట్‌వేర్, బిజినెస్ టూల్స్​ను క్రియేట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించింది.

1995లో విండోస్ 95: స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్, ప్లగ్-అండ్-ప్లే సపోర్ట్​ను ప్రవేశపెట్టిన విప్లవాత్మక అభివృద్ధి. మొదటి ఐదు వారాల్లో 7 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విండోస్ 95 ప్లస్‌లో తొలిసారిగా ప్రారంభమైంది.

1995: ఇంటర్నెట్ రాకతో మైక్రోసాఫ్ట్ తన వెబ్ బ్రౌజర్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ను పరిచయం చేసింది.

1998: విండోస్ మొదటి వినియోగదారు వెర్షన్ అయిన విండోస్ 98 విడుదలైంది. అదే ఏడాది అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మైక్రోసాఫ్ట్ తన ప్రోగ్రామ్‌లను దాని ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కలిపినందుకు దానిపై’ యాంటీట్రస్ట్’ అభియోగాలను నమోదు చేసింది . సాఫ్ట్‌వేర్, గుత్తాధిపత్య పద్ధతుల్లో కంపెనీ తన ఆధిపత్యాన్ని ఉపయోగించి పోటీదారులను వ్యాపారం నుంచి తరిమికొట్టిందని US నియంత్రణ సంస్థలు చేసిన ఆరోపణలు అప్పట్లో దుమారం లేపాయి . వీటన్నింటినీ తట్టుకుని బిల్ గేట్స్ నిలబడ్డారు .

You May Also Like…

షేర్ మార్కెట్ పతనం ఖాయమా ?

షేర్ మార్కెట్ పతనం ఖాయమా ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెంపర్మెంట్ మనపైనా అత్యంత ప్రభావం చూపుతుంది. అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తున్న దేశాలపై...