శృంగారం అంటే స్త్రీ పురుషులకిద్దరికీ మధురమైన అనుభూతే.. అందుకే ఎక్కువ సేపు రతిక్రీడలో పాల్గొని ఆ అనుభూతిని మరింత అనుభవించాలని కోరుకుంటారు. భాగస్వామిని సంతృప్తి పరచడానికి ప్రయత్నింస్తుంటారు. అందుకోసం సెక్స్ పవర్‌ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దానికోసం చాలా మంది విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటారు. వాటిని వాడితే సెక్స్ పవర్ పెరుగుతుందని భావిస్తారు. విటమిన్ మాత్రలు వేసుకుంటే శృంగార శక్తి పెరుగుతుందా? ఇంతకీ విటమిన్ టాబ్లెట్లు వేసుకోవచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా? అయితే దానిమీద నిపుణులు ఏమంటున్నారు? సాధారణంగా మన శరీరానికి విటమిన్లు అవసరం.
అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కొన్నిసార్లు విటమిన్లు తక్కువైతే యాంటీ ఆక్సిన్స్ మనిషిని బలహీనంగా చేస్తాయి. హుషారు లేకుండా చేస్తాయి. అందువల్ల నరాలు కూడా బలహీనంగా మారుతాయి. అందుకే విటమిన్ సీ, ఈ, డీ ఎక్కువగా తీసుకుంటే ఆక్సిడెట్ స్ట్రెస్ తగ్గుతుంది. పాలు, ఆకుకూరలు, పళ్లలో సహజంగా విటమిన్స్ లభిస్తాయి. అందుకే వాటిని తింటే నేచురల్ గా విటమిన్ మాత్రలు కూడా మామూలుగా వేసుకోవచ్చు. అవి మనిషిని హుషారుగా ఉంచుతాయి. అయితే అవి వేసుకుంటేనే సెక్స్ పవర్ పెరుగుతుందని చెప్పలేం. కానీ ఆరోగ్య అవసరాల దృష్ట్యా వాడొచ్చు” అని నిపుణులు చెప్పారు.