తమిళ రాజకీయాలు (Politics) ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. స్టార్ హీరో విజయ్ (Vijay) అక్కడ ఇటీవలే ‘తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam) ’ అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
చెన్నై (Chennai)లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా (Party Flag) ను విజయ్ ప్రకటించారు. కాగా తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా పైన కింద ఎరుపు రంగు ఉండగా.. మధ్యలో పసుపు రంగుతో ఉంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో పువ్వు వికసించినట్లు చుట్టూ స్టార్స్ ఉండటం విశేషం. అయితే ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియా (Tamil Media) లో వైరల్ గా మారింది. తాజాగా రాజకీయాల్లో విజయ్ దూకుడు పెంచడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పార్టీ ఇప్పుడు పెట్టినా 2026లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) నే పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు. అంతకంటే ముందు ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేయనని స్పష్టం చేశారు.