బుల్లితెరపై రియాల్టీ షో (Reality Show) గా పేరుగాంచిన బిగ్ బాస్ సీజన్ -8 (Bigg Boss season -8) సందడి మొదలైంది. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ 1న ఈ సీజన్ ప్రారంభమైంది.
ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫన్, ట్విస్ట్ లు ఎక్కడా తగ్గకుండా ఉంటుందని నాగార్జున (Nagarjuna) తెలిపారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ (Infinity of fun and entertainment) పేరుతో స్టార్ట్ అయిన ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ (Contestants) ఉన్నారు. అయితే వీరిని విడివిడిగా హౌస్ లోకి పంపకుండా ఏడు జంటలుగా పంపారు. దాంతోపాటు వారికి మూడు కండషన్స్ (Three Conditions) కూడా పెట్టారు. బిగ్ బాస్ 8 సీజన్ లో హౌస్ లో కెప్టెన్ ఉండడు. అదేవిధంగా కంటెస్టెంట్స్ కు రేషన్ ఇవ్వరు.. వారే సంపాదించుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ప్రైజ్ మనీ కూడా జీరో అని రివీల్ చేశారు. దీన్ని బట్టి హౌస్ మేట్స్ (Housemates) ఆటతీరును బట్టి ఫ్రైజ్ మనీ లిమిట్ లెస్ గా మారుతుందని తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ హౌస్ (Bigg Boss House) లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో సీరియల్ నటి యష్మీ, నటుడు నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక మరియు నబీల్ ఉన్నారు.