తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఖరారు.. ఇవాళే ప్రకటన !!

తెలంగాణ పీసీసీ చీఫ్ (Telangana PCC Chief) పదవిపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం (Party High Command) పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ (New PCC Chief) లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసిందన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ సాయంత్రం లేదా రేపు అధికారిక ప్రకటన (Official Announcement) వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ దీపాదాస్ మున్షీ, కేరళ పీసీసీ చీఫ్ గా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైందని సమాచారం. అలాగే ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనుండగా.. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేశ్ బగెల్ ఉండనున్నారని సమాచారం.