హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా (Hydra)’ కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాల(Illegal constructions)ను గుర్తించిన హైడ్రా తొలగించే పనిని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ (Chief Ranganath) తమ బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ (GHMC Man Soon) సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అదేవిధంగా నీట మునిగిన ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటిస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లోని అక్రమ కట్టడాలకు ఇరిగేషన్ మరియు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు (Notices) జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు.