భారత్ (India) లో పాస్ పోర్ట్ సేవలు దాదాపు ఐదు రోజుల (Five Days) పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఇవాళ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు ఆన్లైన్ పాస్ పోర్ట్ సర్వీసులు (Online Passport Services) పని చేయవని పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటించింది.
పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల వలన సేవలకు అంతరాయం ఏర్పడనుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు కొత్త అపాయింట్ మెంట్లు (New Appointments) బుక్ చేసుకోవడం కుదరదని చెప్పారు. అయితే కొత్త పాస్ పోర్ట్ (New Passport) తీసుకునే వారితో పాటు పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ వంటి సేవలను పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్లైన్ సేవా పోర్టల్ (Online Portal) ఉపయోగపడుతుంది.