మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry) లో పలువురు ప్రముఖులపై ఇప్పటికే ఆరోపణలు రాగా.. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం ముఖేశ్ (CPI (M) MLA M Mukesh) పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.
కొన్నేళ్ల క్రితం ముఖేశ్ లైంగికంగా వేధించాడంటూ ఓ నటి చేసిన ఆరోపణల (Allegations) నేపథ్యంలో కేసు రిజిస్టర్ (Case Register) చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొచి నగరంలోని మారడు పోలీస్ స్టేషన్ (Maradu Police Station) లో ఐపీసీ 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించారు. అయితే హేమ కమిటీ రిపోర్డు (Hema Committee Report) వచ్చిన తరువాత మలయాళ సినీ పరిశ్రమలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇదే కావడం విశేషం.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై ముఖేశ్ స్పందించారు. గతంలో చేసిన విధంగానే ఇప్పుడు కూడా తనను రాజకీయంగా టార్గెట్ (Target) చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు.