భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, ప్రముఖ క్రికెట్ కోచ్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి విరుచుకుపడ్డారు. తన కుమారుడు యువరాజ్ కెరీర్ ను ధోనీ నాశనం (Destroying) చేశాడని తీవ్ర ఆరోపణలు (Allegations) చేశారు.
ధోనీ ప్రముఖ క్రికెటరే అయినప్పటికీ తనను క్షమించనని (Never Be Forgiven) యోగ్ రాజ్ సింగ్ తెలిపారు. తన కుమారుడికి చేసిన అన్యాయం క్షమించరానిదని పేర్కొన్నారు. క్యాన్సర్ (Cancer) తో బాధపడుతూనే దేశం కోసం ఆడి ప్రపంచకప్ గెలిచాడని చెప్పారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం (India Government) యువరాజ్ కు భారతరత్న ఇవ్వాలని అన్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచ కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) కీలక పాత్ర పోషించారన్న ఆయన సరైన గుర్తింపు దక్కలేదని వెల్లడించారు. ప్రస్తుతం యోగ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారాయి.