Andhagan: కోలీవుడ్ స్టార్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ అంధగన్’. దర్శకుడు త్యాగరాజన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం ప్రీపోన్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
సుమారు నాలుగు సంవత్సరాల పాటు ప్రొడక్షన్ లో ఉన్న ‘ అంధగన్’ ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ బ్లాక్ బస్టర్ ‘అంధాధున్’ తమిళ రీమేక్. హిందీలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రికార్డుల్లో నిలిచిన అంధాధున్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక తెలుగు, తమిళ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ప్రశాంత్ తాజాగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. ఇందులో నటి సిమ్రాన్ నెగిటివ్ రోల్ చేయడం విశేషం. ఆమె పాత్ర ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే అంధగన్ లో మరో ముఖ్యమైన పాత్రను ప్రియా ఆనంద్ పోషించారు. ఇందులో ప్రియా ఆనంద్ ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అంధగన్ యాంథెమ్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలో కార్తీక్, సముద్రఖని, కేఎస్ రవికుమార్, ఊర్వశి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.