Panchayat Elections: తెలంగాణ (Telangana) లో పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని తెలుస్తోంది. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్ల( Arrangements)ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. అదేవిధంగా ఓటరు జాబితా (Voter List) తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా (Voter List)ను ప్రచురించనున్నారు. జాబితాపై సెప్టెంబర్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగే ఛాన్స్ ఉండగా… 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల (Political Parties) నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 21వ తేదీన వార్డుల వారీగా తుది జాబితా( Final List) ను ప్రచురించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ల (District Collectors) తో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.