Jani Master: అవార్డు అందుకోవాలి.. బెయిల్ ఇవ్వండి: జానీ మాస్ట‌ర్ పిటిషన్!

లైంగిక వేధింపుల కేసులో అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌ అరెస్టయిన విషయం తెలిసిందే.. అతడు బెయిల్ కసం ప్రయత్నాలు ప్రారంభించాడు.  అందులో భాగంగా తాను అవార్డు అందుకోవాల‌ని,  5రోజుల పాటు మ‌ధ్యంత‌ర‌ బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశాడు.

నార్సింగ్ పోలీసుల‌కు ఇచ్చిన నాలుగు రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో జానీని మ‌ళ్లీ ఉప్ప‌ర‌ప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం అత‌డిని చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. తనకు ఇటీవ‌ల ఉత్తమ‌ నృత్య‌ద‌ర్శ‌కుడిగా అవార్డు వ‌చ్చిందని.. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉందని  అందుకుగాను ఐదు రోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాలంటూ జానీ కోర్టును కోరాడు. అయితే ఈ పిటిష‌న్‌పై ఈ నెల 7న విచార‌ణ చేప‌డ‌తామ‌ని రంగారెడ్డి ఫోక్సో కోర్టు తెలిపింది.

కాని కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిష‌న్‌ కు పోలీసులు కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు స‌మాచారం. అతడిని వ‌దిలితే సాక్షులను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్ద‌ని త‌మ పిటిష‌న్‌లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది.