కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విభజన హామీలలో ఇది కూడా ఉంది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గత ఏడాది జులై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లను తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ని అభివృద్ధి చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.