హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు (Hydra Demolotions) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు (Notices) జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు (CM Revanth Reddy Brother) తిరుపతి రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నోటీసులపై ఆయన స్పందించారు. 2015వ సంవత్సరంలో అమర్ సొసైటీ (Amar Society) లో ఇంటిని కొనుగోలు చేశానన్న తిరుపతి రెడ్డి ఆ సమయంలో ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదని పేర్కొన్నారు. ఇతర నిర్మాణాల విషయంలో వ్యవహరించిన మాదిరిగానే తన నివాసంపైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలిపారు.