kisan: రైతుల హక్కుల సాధనకు  ఛలో కామారెడ్డి

తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఛలో కామారెడ్డికి పిలుపునిచ్చారు.  అక్టోబర్ 5వ తేదీన శనివారం ఉదయం 10గంటలకు తెలంగాణ రాష్ట్రమహాసభలు జరగనున్నాయని కిసాన్ సంఘ్ నాయకులు భాగ్యనగరంలో తెలిపారు. సమాజంలో 60శాతం ఉన్న రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్దచూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు పరచాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది.

1. రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఎటువంటి నిబంధనలు విధించకుండా ఏకకాలంలో అమలు పరచాలి.
2. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఎకరా Rs 15000/- ఇవ్వాలి.
3. రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వాలి.
4. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు Rs 500/- బోనస్ ఇవ్వాలి.
5. మూతపడిన చక్కెర కర్మాగారాలను వెంటనే తెరిపించి నడపాలి.
6. పంటల బీమా పథకం వెంటనే అమలులోకి తేవాలి.
7. భూమి లేని కౌలు రైతులకు, కూలీలకు కూడా రైతు బీమా వర్తింపజేయాలి.
8. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
9. అసైన్డ్ భూముల లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలి.
10. ధరణి ద్వారా ఏర్పడ్డ అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి గతంలో ఉన్న భూహక్కులను పునరుద్దరించాలి.
11. నకిలీ విత్తనాల, పురుగుమందుల వ్యాపారులపై పీడి చట్టం కేసులు పెట్టి, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి.
12. అసంపూర్ణంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలి.
13. వన్యప్రాణుల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి.
14. వ్యవసాయ యోగ్యమైన పశువులను పెంచే రైతుల పై విద్యుత్ విజిలెన్స్ అధికారులు దొంగతనం కేసులు పెట్టి అవమానించి వేదించడాన్ని నిలిపివేయాలి.
15. ఉత్పత్తి ఖర్చుల ఆధారం చేసుకుని పంటలకు లాభపాటి ధర ఇవ్వాలి.
16. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందు లతో పాటు అన్ని (రైతు) కొనుగోళ్లపై GST రద్దు చేయాలి.
17. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతి విధానం లో రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి.
18. పాల కల్తీని అరికట్టి లాభసాటి ధర నిర్ణయించి ప్రతినెల రైతులకు వెంట వెంటనే చెల్లింపులు చేయవలెను.
పై డిమాండ్ల సాధనకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు అన్నదాతలు, సామాజిక హితం కోరేవారు సభలకు హాజరు కావాలని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది.