cyclone effect:ఉత్తరకోస్తాకు వాయు‘గండం’
వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు వాయు ‘గండం’గా మారింది. వారం రోజుల్లో బుడమేరు … Read more