ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ(APPSC) నూతన ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అనురాధను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ తాజాగా  జీవో విడుదల చేశారు. ఈమె గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా , రాష్ట్ర  హోంశాఖ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు. నిజాయితీగల అధికారిగా గుర్తింపు పొందిన అనురాధ అత్యంత సమర్థురాలుగా కూడా పోలీసు శాఖలో పేరు సంపాదించారు . 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త  సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి.