AP – Cyclone: ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు

రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయి. తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి ఏపీలోని … Read more