పిల్లల అల్లరిని దారిలో పెట్టడానికి.. అంటే డిసిప్లిన్ రూట్చే కి తీసుకురావడానికి ఒక్కోరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు. కొందరు పనిష్మెంట్ విధానాన్ని ఎంచుకుంటే మరికొందరు రివార్డ్ విధానాన్ని ఎంచుకుంటారు. అంటే.. పిల్లలను భయంతోనో., బహుమతులతోనో., లేదా దెబ్బలతో లేదా ఇతర శిక్షలతో వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అతి కొద్దిమంది మాత్రం రివార్డులు ప్రకటిస్తూ దారిలోకి తెస్తారు. అంటే.. చెప్పినట్టు నడుచుకుంటే.. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లాంటిదన్నమాట. ఈ ప్రైజులతో వారిని గాడిలో పెడతారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే దారిని ఎంచుకున్నాడు. పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసి దాన్ని ఫాలో అయితే.. రోజుకు రూ. 10 ఇస్తానని ఆరేళ్ల కొడుకుతో తండ్రి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సత్ప్రవర్తన వారం మొత్తం కొనసాగిస్తే రూ. 100 ఇస్తానని పేర్కొన్నాడు. ఈ ఒప్పంద పత్రంపై తండ్రి తనయులు ఇద్దరు సంతకం పెట్టారు. ఆ ఒప్పంద పత్రాన్ని ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ షెడ్యూల్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉండటంతోపాటు కొంత ఫన్నీగానూ కనిపిస్తుంది. ఆ పిల్లాడి షెడ్యూల్ ఉదయం 7.50 గంటలకు మొదలవుతుంది. అలారం 7.50 మోగుతుందని, లేవడం పది నిమిషాల తర్వాత అంటే 8.00 గంటలకు లేవాలి. . అంటే.. అలారం మోగగానే సాధారణంగా పిల్లలు ‘నాన్న మరో పది నిమిషాలు’ అని గోముగా అడుగుతారు కదా. దాని కోసం ఆ తండ్రి ముందుగానే ఆ పది నిమిషాలను టైం టేబుల్లో చేర్చాడు. బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి 20 నిమిషాలు కేటాయిస్తే.. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయడానికి 30 నిమిషాలు ఇచ్చాడు. ఆడుకునే సమయం, టీవీ వీక్షించడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, హోం వర్క్‌కు అన్నింటికీ సమయాన్ని కేటాయించాడు. ఇదంతా ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరతీసింది. పిల్లల్ని ఇలా దారిలోకి తెచ్చుకోవడం సరైన విధానమని పలువురు నెట్ జన్లు సపోర్ట్ ట్వీట్స్ చేస్తున్నారు.