AP: ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

NELLORE: ఘనంగా చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేతన్నలకు బాసటగా నిలవాలని కోరారు. చేనేత ఐక్యవేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ , బుచ్చిరెడ్డిపాలెం మండలం బీజేవైఎం మండల అధ్యక్షుడు గోలి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ ఎన్నిక బాబుకు గుణపాఠం కావాలి: జగన్

AP: విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికపై YCP అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘TDPకి సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. నేను CMగా ఉంటే పోటీ పెట్టేవాడిని కాదు. YCPకి 380 పైచిలుకు మెజార్టీ ఉన్నా డబ్బుతో రాజకీయాలను CBN దిగజారుస్తున్నాడు. బొత్సను గెలిపించి CMకు గుణపాఠం చెప్పాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.