కొత్త సంవత్సరం మన జీవితాలను ప్రతిబింబించేదన్న భావన మనలో చాలా మందికి ఉంటుంది. గతం ఎలా గడిపేసిన.. ఎన్నో ఆశలతో సాగాలని వర్తమానంపై గంపెడాశ పెట్టుకుంటాం. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా, సామాజికంగా.. ఎన్నో సాధించాలని నూతన సంవత్సర శుభ వేళ ప్రతినబూనుతాము. అనుకున్నవన్నీ ఖచ్చితంగా పాటించాలని కసిగా అనుకుంటాం. ఓ నాలుగైదు రోజులు క్రమశిక్షణగానే పాటిస్తాం. తర్వాత తీరికలేదనో, రాత్రి లేట్ అయిందని ఉదయాన్నే లేవడానికి బద్ధకం వచో.. ఇలా ఏవేవో కారణాలతో మనం పెట్టుకున్న టార్గెట్స్ నెమ్మదిగా పక్కకుపోతాయి. మనలో మెజార్టీ జనంలో ఇదే తంతు.
మనం చేయలేని బోలెడన్ని లక్ష్యాలు కాకుండా.. ఒకటి, రెండు టార్గెట్స్ పెట్టుకుని వాటిని, స్వీయ క్రమశిక్షణతో పాటిస్తే ఎంతోకొంత ఎదుగుదల కనిపిస్తుంది. అలా ఏటేటా పెట్టుకునే చిన్న చిన్న లక్ష్యాలే మన అంతిమ లక్ష్యాన్ని చేరేందుకు నిచ్చెనలా ఉపయోగపడతాయి.