”బాబాయ్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు చంపించాడని ప్రతిపక్షంలో ఉన్నపుడు గగ్గోలు పెట్టిన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి.. అప్పట్లో వివేకా హత్యను ఉపయోగించుకుని రాజకీయంగా భారీ లబ్ది పొందారు. ‘నారా సుర రక్త చరిత్ర’ శీర్షికన సొంత పత్రిక సాక్షిలో భారీ కధనం వేయించారు. వివేకాను చంపించాల్సిన అగత్యం చంద్రబాబుకు ఎందుకు ఉంటుంది> అలాంటి మనషుతత్వం చంద్రబాబుది కాదే.. అని కూడా సగటు జనానికి అర్ధం కాలేదా? బాబాయ్ హత్య వ్యవహారంలో జగన్ నాటకాన్ని జనం .. నమ్మి ఉండవచ్చు.. కానీ దేవుడికి ఇవన్నీ తెలియవా? తెలిస్తే సంబందించిన వారికీ శిక్ష వేయాలి కదా…” ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో తనను కోడికత్తితో గీసినప్పుడు భీతావహం చెందినట్టుగా జగన్ ప్రదర్శించిన నటనను అప్పుడు మెజార్టీ ప్రజలు తెలుసుకోలేకపోయారు. సొంత ఇంటిలోనే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయన ప్రదర్శించిన నటన అనితర సాధ్యం// గొడ్డలితో నరకడం వల్ల వివేకానంద రెడ్డి తల ఛిద్రమై చనిపోయినప్పటికీ, ఆయన గుండెపోటుతో చనిపోయారని కొన్ని గంటలపాటు రాష్ట్ర ప్రజలను నమ్మించగలిగిన జగన్ అండ్ కో నటనా చాతుర్యాన్ని కాదనగలమా? వివేకాను చంపినవాళ్లు, చంపించినవాళ్లను చుట్టూ పెట్టుకొని తన బాబాయ్‌ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే చంపించాడని చెబితే జగన్‌లోని నటుడిని గుర్తించలేని జనం అది నిజమేనని నమ్మి ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చాక వివేకాను చంపింది మరెవరో కాదు.. ఆయన ఏకైక కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తన సొంత మీడియా ద్వారా ప్రచారం చేయించినా జగన్‌లోని నటుడిని ప్రజలు తెలుసుకోలేకపోయారు. వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడం, ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి దంపతుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌లను విచారించినప్పటికీ ‘అబ్బే ఇందులో కుట్ర ఏమీ లేదు’ అని జగన్ అనుంగు సహచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుకాయిస్తుండటంతో ఏది నటనో, ఏది నిజమో జనం తెలుసుకోలేక సతమతమవుతున్నారు. ఇవే కాకుండా రాజకీయ ప్రత్యర్థులను వేటాడటంలో ఇన్నాళ్లు దుష్ట-చతుష్టయంలా ..ఉన్న బ్యాచ్ ఇంకా బింకంగానే ఉండటం ఏమనాలి? రాష్టంలో ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. ఇవన్నీ జనం గమనిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు స్టార్ట్అ అయింది. యితే డబ్బు ప్రభావం ముందు..ఇవి ఎన్నికలలో ఈమేరకు పనిచేస్తాయో వేచి చూడాలి.