టెలిగ్రామ్ యాప్ కు మరింత ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కొత్త ఆ సంస్థ కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ పోతోంది. 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్న టెలిగ్రామ్ బాట్స్ ద్వారా యూజర్లకు మరిన్ని సేవలు అందిస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. ఫొటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను క్షణాల్లో తొలగించేలా ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ బాట్ ను యాడ్ చేసింది టెలిగ్రామ్ సంస్థ. దీనికోసం ఇతర యాప్‌లను ప్రత్యేకంగా ఉపయోగించనక్కర్లేదు. ఈ బాట్ చాట్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్‌ను తొలిగించాలనుకుంటున్న ఫొటోను అప్లోడ్ చేస్తే చాలు.. వెంటనే అది బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించి హై రిజల్యుషన్ ఫొటోగా మార్చేస్తుంది. తర్వాత మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫేక్ ఈ మెయిల్
అలాగే మరక ఫీచర్ ‘డ్రాప్ మెయిల్ మి (Dropmail.me) బాట్. మనం సాధారణంగా సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేయాలన్నా, యాప్స్‌లోకి లాగిన్ కావాలన్నా ఈ మెయిల్ ఐడీని అడుగుతాయి. ఒక్కోసారి మెయిల్ ద్వారానే ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంటుంది. అలాంటి సమయంలో మన వ్యక్తిగత ఈ మెయిల్ ఐడీని తెలియజేయవద్దనుకున్నప్పుడు.. మనకోసం ఓ ఫేక్ మెయిల్ ఐడీని క్రియేట్ చేస్తుంది టెలిగ్రామ్‌లోని Dropmail.me బాట్. ఓటీపీ వెరిఫికేషన్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు.
ఫైల్ కన్వెర్టర్
టెలిగ్రామ్‌లోని ఫైల్ కన్వర్టర్ బాట్ ద్వారా ఇమేజ్, వీడియో ఫార్మాట్లను సులభంగా మార్చుకోవచ్చు. ఈ బాట్ చాట్‌లోకి మనం కన్వర్ట్ చేయాలనుకున్న ఇమేజ్, వీడియో ఫైల్‌ను అప్లోడ్ చేసి.. అది ఏ ఫార్మాట్లో కావాలో ఆప్షన్లో ఎంపిక చేసుకుని ఓకే చేస్తే సరిపోతుంది. క్షణాల్లోనే మనకు కావాల్సిన ఫార్మాట్లో ఫొటో, వీడియో వచ్చేస్తుంది. అనంతరం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Babelgram
దీని ద్వారా ఒక భాషను ఇతర భాషలోకి ట్రాన్స్‌లేట్ చేయవచ్చు. మనం ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చి దాన్ని ఓ భాషలోకి మార్చాలనుకుంటున్నామో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
File to bot
ఈ బాట్ ద్వారా మనం ఫైల్స్‌ను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రాప్ చేసే ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ అన్ని ఉచితంగా సేవ్ అయి ఉంటాయి. స్టోరేజీ పరిమితి కూడా ఉండదు. మనకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవేగాక ఇంకా చాలా బాట్స్ ద్వారా వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందిస్తోంది టెలిగ్రామ్.