నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇదొక అడుగని కేంద్రం పేర్కొన్నది. ఈ విధానం సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించనున్నది. వివిధ ప్రభుత్వ శాఖలకు సమర్పించిన నకిలీ సమాచారాన్ని తగ్గించడంలో, కఠిన నిబంధనలను సరళీకరించడంలో, ప్రాజెక్టులు ఫలితాలను సాధించే కాల పరిమితిని తగ్గించడంలో ఈ విధానం సహాయపడనున్నది.