భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ హాక్ ఏజేటీ ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు. తండ్రితో కలసి యుద్ధ విమానాన్ని నడపడం చాలా ఆనందంగా ఉందని అనన్య పేర్కొన్నారు.