తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై స్పందించిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ…వేంకటేశ్వర స్వామి చూస్తున్నారని అన్నారు.
గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమవుతోన్న లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ (Khushbu Sundar) స్పందించారు. ఎక్స్ (‘X’) వేదికగా ఆమె పోస్టు పెట్టారు. బాధ్యులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ఆ పోస్టులో ‘తిరుమల లడ్డూ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తారా? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. లౌకికవాదం అంటే ప్రతీ మతాన్ని గౌరవించడం. అంతేగానీ వివక్షతో వ్యవహరించొద్దు. నేనూ హిందూ మతంలో పుట్టకపోయినా… హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్నీ మతాలు సమానమే. హిందూ మతాన్ని అవమానించొద్దు. చులకంగా మాట్లాడొద్దు. దాన్ని అగౌరవపరిస్తే సహించొద్దు. తిరుమల లడ్డూలు కల్తీ చేయద్యమంటే కొట్లాదిమంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీయడమే. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వేంకటేశ్వరస్వామి చూస్తున్నారు’ అని ఖుష్బూ పేర్కొన్నారు.